అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు
Today Stock Market : భారత స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు గురువారం (Thursday)లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ (Interenational)మార్కెట్ల (Markets)లోని సానుకూల సంకేతాలు మార్కెట్లలో ఉత్సాహం నింపాయి. నిఫ్టీ (Nifty) 87 పాయింట్లు లాభపడి 18,269 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రెండు పైసలు పుంజుకొని 82.35 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ (Sensex) 30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, నెస్లే ఇండియా, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ, అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
ఎంఅండ్ఎం, హెచ్యూఎల్, టైటన్, హెచ్సీఎల్ టెక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా (America)మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. అప్పుల పరిమితి పెంపు విషయంలో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య సయోధ్య కుదిరే అవకాశం ఉందన్న వార్తలు అక్కడి సూచీల్లో సానుకూలతలు నింపాయి. అక్కడి నుంచి సంకేతాలు అందుకున్న ఆసియా-పసిఫిక్ సూచీలు నేడు లాభాల్లో కొనసాగుతున్నాయి.