Stock Markets: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Stock Markets Update: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో దూసుకుపోయాయి. నిన్న కూడా లాభాల్లో ముగిసన మార్కెట్లు ఈరోజు భారీ లాభాలను దక్కించుకున్నాయి. టెక్నాలజీ, ఫైనాన్సియల్ స్టాక్స్ లాభాలను ముందుండి నడిపించాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,041 పాయింట్లు లాభపడి 56,857కి చేరుకుంది. నిఫ్టీ 288 పాయింట్లు పెరిగి 16,930కి ఎగబాకింది. టెక్నాలజీ, ఆర్థిక రంగ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లోకి దూసుకెళ్తున్నాయి. ఉదయమే సానుకూలంగా ప్రారంభమైన మార్కెట్లు సమయం గడుస్తున్న కొద్దీ కొత్త ఇంట్రాడే గరిష్ఠాలను నమోదు చేస్తున్నాయి. ఆసియా సూచీలు సైతం అదే బాటలో పయనిస్తున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను 75 బేసిస్ పాయింట్లు పెంచడమే దీనికి ప్రధాన కారణం. వాస్తవానికి ద్రవ్యోల్బణ కట్టడిపై ఫెడ్ కఠినంగా వ్యవహరిస్తామని గతంలోనే ప్రకటించింది. ఆ అంచనాలకు తగినట్లు నిర్ణయాలు ఉండటంతో మార్కెట్ ఊపిరిపీల్చుకొంది
బజాజ్ ఫైనాన్స్ 10.68 శాతం లాభపడగా.. బజాజ్ ఫిన్ సర్వ్ 10.14 శాతం, టాటా స్టీల్ 4.59 శాతం, కోటక్ మహీంద్రా బ్యాంక్ 4.34 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంక్ 3.90 శాతం లాభపడి టాప్ గెయినర్స్‌గా నిలువగా.. భారతి ఎయిర్ టెల్ -1.19 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ -0.99 శాతం, డాక్టర్ రెడ్డీస్ -0.73 శాతం, ఐటీసీ -0.16 శాతం, సన్ ఫార్మా -0.12శాతం నష్టాలను ముటగట్టుకున్నాయి.