Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Stock Market Today Update: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. ఉదయం మార్కెట్లు ప్రారంభంలోనే లాభపడినా, రోజంతా లాభ నష్టాల మధ్య ఊగిసలాడాయి. చివరికి సెన్సెక్స్ 344 పాయింట్ల లాభంతో 53 వేల 760 వద్ద ముగియగా.. నిఫ్టీ 110 పాయింట్ల లాభంతో 16 వేల 49 వద్ద ముగిసింది. తద్వారా నిఫ్టీ 16వేల స్థాయిని ఎగువన ముగిసింది. కానీ సెన్సెక్స్ ఇంకా 54 వేల దిగువనే ఉంది.
సెన్సెక్స్‌లో ఈ రోజు హిందుస్థాన్ యూనిలీవర్ 2.86 శాతంలాభ పడగా.. టైటాన్, టాటా మోటార్స్, హెచ్‌యూఎల్, ఐషర్ మోటార్స్ మారుతీ సుజుకీ ఇండియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. టాటా స్టీల్, పవర్ గ్రిడ్ హెచ్‌సిఎల్ టెక్, విప్రో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, డాక్టర్ రెడ్డీస్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, టీసీఎస్, టెక్ మహీంద్రా, సన్‌ఫార్మా షేర్లు నష్ట పోయాయి. అయితే ఐటీ షేర్ల నష్టాలు మార్కెట్లను ప్రభావితం చేశాయి. మరోవైపు డాలరుతో పోల్చుతే రూపాయి మారకం విలువ 79.88 మరోసారి రికార్డు కనిష్టానికి చేరింది. గురువారం 79.90 వద్ద రికార్డు కనిష్టాన్ని టచ్ చేసిన రూపాయి విలువ చివరకు 79.89 వద్ద క్లోజ్ అయింది.