దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత ఊగిసలాటలో కొనసాగాయి.
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత ఊగిసలాటలో కొనసాగాయి. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు (Investers) అమ్మకాలు జరిపారు. అంతర్జాతీయ మార్కెట్ల (International Markets) నుంచి ప్రతికూల సంకేతాలు.. దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి.
ఈ పరిణామాల మధ్య బీఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex) 244 పాయింట్లు నష్టపోయి 64,831 వద్ద ముగిసింది. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ (NSE Nifty) 88 పాయింట్ల నష్టంతో 19,253 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకపు విలువ రూ.82.75 వద్ద ఉంది. ఇక సెన్సెక్స్‌లో రిలయన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏషియన్ పెయింట్స్, వేదాంత లిమిటెడ్, టాటా కన్సాల్టెన్సీ సర్వీసెస్, భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సన్ ఫార్మా, హీరో మోటోకార్ప్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, కోల్ ఇండియా, హిందుస్థాన్ యునిలివర్, ఎల్టీ, ఆయిల్ న్యాచురల్ గ్యాస్ కార్పోరేషన్, బజాజ్ ఆటో, ఐటీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, పవర్‌గ్రిడ్, యస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఇక మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ముగిశాయి.