Stock market: స్టాక్ మార్కెట్లు (Stock market) సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సూచీలు కాసేపటికే లాభాల్లోకి జారుకున్నాయి.
Stock market: స్టాక్ మార్కెట్లు (Stock market) సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సూచీలు కాసేపటికే లాభాల్లోకి జారుకున్నాయి. ఇన్వెస్టర్లు (Investers) ఎక్కువగా కొనుగోళ్లు జరపడం మార్కెట్లకు కలిసొచ్చింది. దీంతో సూచీలు రోజంతా లాభాల్లోనే కదలాడాయి. అంతర్జాతీయ మార్కెట్ల (International markets) నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లవైపే మెగ్గు చూపారు.
ఈ పరిణామాల మధ్య మార్కెట్లు ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ (Sensex) 234 పాయింట్లు లాభపడి 61,963 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ (Nifty) 111 పాయింట్లు లాభపడి 18,314 వద్ద క్లోజ్ అయింది. డాలరుతో రూపాయి మారకపు విలువ రూ. 82.86 వద్ద ఉంది.
ఇకపోతే రిలయన్స్, ఎల్టీ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, మహీంద్రా అండ్ మహీంద్రా, వేదాంత లిమిటెడ్, మారుతి, హెచ్‌సీఎల్ టెక్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, సన్‌ఫార్మా, ఐటీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. అదే సమయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, హెచ్డీఎఫ్సీ, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హిందుస్థాన్ యునిలివర్, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, హీరో మోటో కార్ప్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, కోల్ ఇండియా, ఆయిల్ న్యాచురల్ గ్యాస్ కార్పోరేషన్, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.