Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ (Stock market) సూచీలు మంగళవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. కాసేపు ఊగిసలాటలో కొనసాగాయి.
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ (Stock market) సూచీలు మంగళవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. కాసేపు ఊగిసలాటలో కొనసాగాయి. ఇన్వెస్టర్లు (Investers) ఎక్కువగా కొనుగోళ్లు జరిపారు. మదుపర్లు ఆచీతూచీ అడుగులేస్తున్నారు. దీంతో కొనుగోళ్ల ఒత్తిడి పెరగి సూచీలు పూర్తిగా నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల (International markets) నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నాయి.
ఈ పరిణామాల మధ్య మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 413 పాయింట్ల నష్టంతో 61,932 వద్ద ముగిసింది. నిఫ్టీ 112 పాయింట్ల నష్టంతో 18,286 వద్ద క్లోజ్ అయింది. డాలరుతో రూపాయి మారకపు విలువ రూ. 82.21 వద్ద ఉంది. ఇకపోతే మార్కెట్లు ముగిసే సమయానికి రిలయన్స్, ఎల్ అండ్ టీ, సన్‌ఫార్మా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్డీఎఫ్సీ, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్చ మారుతి, హెచ్‌సీఎల్ టెక్, భారతీ ఎయిర్టెల్, అదానీపోర్ట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఆటో, కోటక్ మహీంద్రా బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్ గ్రిడ్ షేర్లు నష్టపోయాయి. అలాగే ఐటీసీ, టాటా మోటార్స్, కోల్ ఇండియా, ఆయిల్ న్యాచురల్ గ్యాస్ కార్పోరేషన్, హిందూయునిలివర్, టైటాన్, ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, విప్రో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు నష్టాల్లో ఉన్నాయి.