Stock Market: వరుసగా మూడు రోజులుగా లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు (Stock Market).. బుధవారం నష్టాలతో ముగిశాయి.
Stock Market: వరుసగా మూడు రోజులుగా లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు (Stock Market).. బుధవారం నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు ఉన్నాయి. దీంతో అప్రమత్తమై ఇన్వెస్టర్లు కొనుగోళ్ల వైపు ఎక్కువగా మొగ్గుచూపారు. ఈక్రమంలో కొనుగోళ్ల ఒత్తిడి పెరిగి సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నం తర్వాత సూచీలు పూర్తిగా నష్టాల్లోనే కొనసాగాయి.
ఈ పరిణామాల మధ్య మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ (Sensex) 208 పాయింట్లు నష్టపోయి.. 61,773 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ (Nifty) 62 పాయింట్లు నష్టపోయా 18,285 వద్ద క్లోజ్ అయింది. డాలరుతో (Dollar) రూపాయి మారకపు విలువ రూ. 82.68 వద్ద ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పవర్‌గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, మహీంద్ర అండ్ మహీంద్రా, వేదాంత లిమిటెడ్, మారుతి, ఇండస్ ఇండ్ బ్యాంక్, హీరో మోటా కార్ప్, సన్‌ఫార్మా, కోల్ ఇండియా, ఐటీసీ, ఆయిల్ న్యాచురల్ గ్యాస్ కార్పోరేషన్ షేర్లు లాభాలతో ముగిశాయి. రిలయన్స్, ఎల్టీ, ఎన్టీపీసీ లిమిటెడ్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, హిందుస్థాన్ యునిలివర్, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఆటో, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.