SVC Bank: సిలికాన్ వ్యాలీ బ్యాంకు మాదిరిగానే SVC మూత పడనుందా? నిజమేనా?
Silicon Valley Bank Collapse Impacted A 116-Year-Old Indian Bank SVC
సిలికాన్ వ్యాలీ బ్యాంకు దివాళా తీసింది. వందలాది స్టార్టప్ కంపెనీలకు పెట్టుబడులు అందించిన ఆ బ్యాంక్ ప్రస్తుతం నిండా మునిగింది. ఆ ప్రభావం భారతదేశంపై పడిందని ఇక్కడ ఉన్న SVC కూడా దివాళా తీసిందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ పరిణామాలపై SVC యాజమాన్యం స్పందించింది. తమ బ్యాంకుపై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని..అవన్నీ పుకార్లేనని స్పష్టం చేసింది. తమ బ్యాంకు మునిగిపోనుందని తప్పుడు ప్రచారం చేస్తున్న వారికపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బ్యాంక్ యాజమాన్యం హెచ్చరించింది. ఒక ప్రకటన విడుదల చేసింది.
షెమారూ విఠల్ కో ఆపరేటివ్ బ్యాంక్ 1906లో ముంబైలో ప్రారంభం అయింది. అప్పటి నుంచి నిరంతరంగా సేవలు అందిస్తోంది. మన దేశంలో ఈ బ్యాంకుకు 11 రాష్ట్రాల్లో 198 బ్యాంచులు ఉన్నాయి. 214 ఏటీఎం సెంటర్లు కూడా ఉన్నాయి. 2300 మంది ఉద్యోగులు కలిగిన ఈ సంస్థ 2021-22లో 146 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించింది.
సిలికాన్ వ్యాలీ బ్యాంకు దివాలా తీసిన నేపథ్యంలో భారతదేశంలో ఉన్న ఎస్వీసీ బ్యాంకు కూడా దివాలా తీయనుందని పుకార్లు రావడంతో కస్టమర్లు ఆందోళనకు గురయ్యారు. తమకు చెందిన ఖాతాలలో నుంచ డబ్బులు డ్రా చేయడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో బ్యాంకు యాజమాన్యం స్పందించింది. ఒక ప్రకటన విడుదల చేసింది. కస్టమర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది.
SVC, an Indian Bank, issued a statement about not being related to SVB after it saw large withdrawals as rumors quickly started to spread it might be connected to SVB because of its name. pic.twitter.com/qfFhjFSyv0
— Tridev Gurung (@tridevgurung) March 12, 2023
Shamrao Vithal Co-op Bank clarifying it isn't associated with SVB Bank 🙂
SVC is different from SVB, stop the WhatsApp university now! pic.twitter.com/TAvY7lPP2p
— Intrinsic Compounding (@soicfinance) March 11, 2023
SVC Bank