SEBI Key Decision on share rigging case: స్టార్ నటుడిని బ్యాన్ చేసిన సెబీ… యూట్యూబర్లపై వేటు
SEBI Key Decision on share rigging case: స్టాక్, షేర్ మార్కెట్ విషయంలో సెబీ కీలక నిర్ణయం తీసుకున్నది. దీనికి సంబంధించి మ్యానిప్యులేషన్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణలపై సెబీ స్పందించింది. షేర్ మార్కెట్ నుండి స్టార్ నటుడు అర్షాద్ వర్షీ, ఆయన భార్య గోరెట్టినీ ట్రేడింగ్ చేయకుండా బ్యాన్ చేసింది. సాధనా బ్రాడ్ కాస్ట్ షేర్లను మ్యానిప్యులేషన్ చేసి యూట్యూబ్‌లో వీడియోలు పోస్ట్ చేయడం ద్వారా బాలివుడ్ నటుడు ఆర్షాద్ వర్షీ, ఆయన భార్య గోరెట్టి లాభాలు ఆర్జించారని సెబీ పేర్కొన్నది. సాధనా బ్రాడ్ కాస్ట్ సంస్థ షేర్లు మ్యానిప్యులేట్ చేయడంతో ఆ సంస్థ రూ. 41.85 కోట్లు ఆర్జించిందని సెబీ పేర్కొన్నది. ఈ సొమ్మును రెగ్యులేటర్ సెబీ స్వాధీనం చేసుకున్నది.
ఇక షేర్ పంప్ అండ్ డంప్ స్కీమ్ లో బాలివుడ్ నటుడు ఆర్షద్ వార్షీతో సహా మొత్తం 45 మంది యూట్యూబర్లను దోషులుగా తేల్చింది. రాబోయే రోజుల్లో వీరు ఎలాంటి ట్రేడింగ్‌కు చేయరాదని స్పష్టం చేసింది. నటుడు అర్షాద్ వర్షీపై సంవత్సరంపాటు నిషేధం విధించింది. యూట్యూబర్లు ట్రేడర్స్ సంస్థలతో చేతులు కలిపి ట్రేడింగ్, స్టాక్ మార్కెట్లపై వీడియోలు చేస్తూ వినియోగదారులను తప్పుదోవ పట్టించి షేర్లు కొనుగోలు చేసేలా చేస్తున్నారు. వీడియోలు చేసిన వినియోగదారులు షేర్లను కొనుగోలు చేసి నష్టపోతున్నారని సెబీ గుర్తించింది. అయితే, యూట్యూబర్లపై నిఘాపెట్టిన సెబీ సంస్థ తాజాగా 31 మంది యూట్యూబర్లపై నిషేధం విధించింది.