SC: అదానీ, హిండెన్ బర్గ్ వివాదంపై సుప్రీం కోర్టు నిపుణుల కమిటీ
SC sets up expert committee on the issue arising out of Hindenburg report
అదానీ కంపెనీలో హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ చేసిన ఆరోపణలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు నమోదు అయ్యాయి. ఈ ఆరోపణల విషయంలో కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. రెగ్యులేటరీ సంస్థలు ఈ విషయాన్ని చూసుకుంటాయని స్వయంగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. హిండెన్ బర్గ్ ఆరోపణల నేపథ్యంలో అదానీ కంపెనీలో పెట్టుబడుగులు పెట్టిన ఇన్వెస్టర్ల బాగోగుల గురించి కేంద్ర మంత్రి వర్గంలో ఏ ఒక్కరు సమాధానం చెప్పే స్థితిలో లేరు.
నిపుణుల కమిటీలో ఎవరున్నారంటే..
అదానీ సంస్థపై వచ్చిన ఆరోపణలలో నిజా నిజాలు తేల్చాలని కోరుతూ దేశంలో అనేక మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అనేక పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఓ నిపుణుల కమిటీని నియమించింది. జస్టిస్ ఏఎం సాప్రే నేతృత్వంలో ఈ కమిటీ ఈ అంశాన్ని పరిశీలించనుంది. ఇన్వెస్టర్లు ఆందోళన చెందకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయాన్ని కూడా ఈ కమిటీ పరిశీలించనుంది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీలో సాప్రేతో పాటు ఓపీ భట్, జస్టిస్ జేపీ దేవ్ దత్, కేవీ కామత్, నందన్ నీలేఖని, సోమశేఖర్ సుందరేశన్ ఉన్నారు.
రెండు నెలల్లో నివేదిక
సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ రెండు నెలల్లో తమ నివేదిక ఇవ్వనుంది. సీట్లు కవరులో నివేదికను సమర్పించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూద్ కమిటీ సభ్యులను కోరారు. అదే విధంగా సెబీ కూడా ఈ అంశాన్ని పరిశీలిస్తోందని… ఆ ప్రక్రియా అదే విధంగా కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.