RBI Governor: జనవరిలో రూ. 51 లక్షల కోట్ల విలువైన డిజిటల్ పేమెంట్లు
Rs.51 lakh crretail digital payment transactions processed in Jan 2023
భారతదేశంలో డిజిటల్ పేమెంట్ల జోరు రోజు రోజుకు పెరుగుతోంది. కోట్లాది మంది ప్రజలు డిజిటల్ పేమెంట్లకు అలవాటు పడుతున్నారు. దీంతో లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు ఆన్ లైన్ ద్వారా జరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నెలలో ఏకంగా51 లక్షల కోట్ల విలువైన 1050 కోట్ల డిజిటల్ పేమెంట్ ట్రాన్జాక్షన్లు జరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు.
గ్లోబల్ పేమెంట్స్ స్పేస్ విభాగంలో ఇండియా షైనింగ్ స్టార్ వలే వెలుగుతోందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ అన్నారు. డిజిటల్ పేమెంట్స్ విధానం ఎంతో సౌకర్యవంతంగా, భద్రంగాచ, వేగంగా ఉన్న కారణంగా ఎంతో ఆదరణ పొందుతోందని శక్తికాంత్ దాస్ తెలిపారు.
కొచ్చిలో పేమెంట్ సిస్టమ్ ఆపరేషన్స్ కాన్ఫరెన్స్ లో ప్రసగించిన శక్తికాంత్ దాస్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో మొత్తం 114కోట్ల మొబైల్ ఫోన్లు ఉన్నాయని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో 55 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 45 శాతం ఉన్నాయని తెలిపారు. మొబైల్ ఫోన్లు అధిక సంఖ్యలో ఉండడం, ఇంటర్నెట్ సేవలు విస్తృతంగా అందుబాటులో ఉన్న కారణంగా డిజిటల్ పేమెంట్లు అధిక స్థాయిలో జరుగుతున్నట్లు శక్తికాంత్ దాస్ తెలిపారు.
2016లో ప్రారంభమైన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ పేమెంట్స్ ఎకోసిస్టం విప్లవాత్మక స్థాయిలో మార్పులకు కారణమయిందని శక్తికాంత్ దాస్ తెలిపారు. ఈ ఏడాది జనవరిలో యూపీఐ ద్వారా 13 లక్షల కోట్ల విలువైన 803 కోట్ల ట్రాన్జాక్షన్లు జరిగినట్లు దాస్ వెల్లడించారు.