ప్రఖ్యాత రైడింగ్ కంపెనీ లిఫ్ట్ ఉద్యోగాల్లో కోత విధంచనుంది. సంస్థలో పనిచేస్తున్న వారిలో 13 శాతం మందిని ఇంటికి పంపుతున్నట్లు తెలుస్తోంది. కంపెనీ నిర్ణయంతో దాదాపు 683 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. సంస్థలో పెరిగిపోతున్నఖర్చులను తగ్గించుకోడానికే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
Ride-hailing firm Lyft to sack 683 employees to cut costs
ప్రఖ్యాత రైడింగ్ కంపెనీ లిఫ్ట్ ఉద్యోగాల్లో కోత విధంచనుంది. సంస్థలో పనిచేస్తున్న వారిలో 13 శాతం మందిని ఇంటికి పంపుతున్నట్లు తెలుస్తోంది. కంపెనీ నిర్ణయంతో దాదాపు 683 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. సంస్థలో పెరిగిపోతున్నఖర్చులను తగ్గించుకోడానికే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
సెప్టెంబర్ నెలలోనే తమ సంస్థలోని ఉద్యోగులకు లిఫ్ట్ కంపెనీ కోత విషయాన్ని సూచనప్రాయంగా తెలియజేసింది. క్రమ క్రమంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే పనిలో ఆ సంస్థ ఉన్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఆర్ధిక పరిస్థితులు అనకూలంగా లేకపోవడంతో ఈ ఏడాది చివరి నాటికి కంపెనీలోని అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయని కంపెనీ అధికార ప్రతినిధి వెల్లడించారు.
ప్రపంచ వ్యాప్తంగా చాలా కంపెనీలు తమ సంస్థలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా ట్విట్టర్ కంపేనీ కూడా అనే బాటలో నడుస్తోంది. ఇప్పటికే కొంత మందికి ఉధ్వాసన పలికింది. ఎలాన్ మస్క్ వచ్చిన నాటి నుంచి ఆ సంస్థలో ఉద్యోగులలో అభద్రత పెరిగింది.