RBI Governor: క్రిప్టో కరెన్సీ బ్యాన్ చేయాలి, అవి జూదం లాంటివి-శక్తికాంత్ దాస్
RBI governor ShaktiKanth Das seeks ban of CryptoCurrency
దేశంలో క్రిప్టో కరెన్సీను నిషేదించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. క్రిప్టో కరెన్సీని జూదంతో పోల్చారు. ఏ ఆస్థికైనా, ఆర్ధిక ఉత్పత్తికైనా అంతర్గత విలువ ఉండాలని, క్రిప్టోల విషయంలో అటువంటిది ఏదీ లేదని శక్తికాంత్ దాస్ అభిప్రాయపడ్డారు. క్రిప్టో కరెన్సీ ని కొందరు ఆస్తిగా భావిస్తున్నారని, కొందరేమో ఫైనాన్సియల్ ప్రాడక్ట్ కింద భావిస్తున్నారని శక్తికాంత్ దాస్ తెలిపారు. కానీ వాటికి ఏ విలువా లేదని దాస్ స్పష్టం చేశారు.
క్రిప్టో కరెన్సీ ద్వారా ఆర్దిక లావాదేవీలు జరిగితే, భారత ఆర్ధిక వ్యవస్థపై రిజర్వ్ బ్యాంక్ ఆధిపత్యం తొలగిపోనుందని శక్తికాంత్ దాస్ అభిప్రాయపడ్డారు. గత కొంత కాలంగా క్రిప్టో కరెన్సీపై శక్తికాంత్ దాస్ తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. క్రిప్టోలను ప్రోత్సహిస్తే తీవ్ర ఆర్ధిక పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
కొన్ని వారాల క్రితం జరిగిన ఓ సమావేశంలో కూడా శక్తికాంత్ దాస్ ఈ విధమైన అభిప్రాయమే వ్యక్తం చేశారు. క్రిప్టో కరెన్సీని ప్రోత్సహిస్తే దేశ ఆర్ధిక స్థిరత్వం దెబ్బ తింటుందని శక్తికాంత్ దాస్ తెలిపారు. FTX సంస్థ ఏ విధంగా పతనం అయిందనే విషయాన్ని కూడా శక్తికాంత్ దాస్ గుర్తుచేశారు.