రూ. 2000 నోటు వెనక్కి తీసుకునే అంశం చురుగ్గా సాగుతోంది. మొదటిరోజు గందరగోళ పరిస్థితులు నెలకొన్నా రెండో రోజు ఆ పరిస్థితుల్లో కొంతమేర మార్పులు కనిపించాయి. బ్యాంకుల వద్ద పెద్ద సంఖ్యలో క్యూలైన్లు కనిపించలేదని ఆర్బీఐ గవర్నర్ తెలియజేశారు.
RBI Governor: రూ. 2000 నోటు వెనక్కి తీసుకునే అంశం చురుగ్గా సాగుతోంది. మొదటిరోజు గందరగోళ పరిస్థితులు నెలకొన్నా రెండో రోజు ఆ పరిస్థితుల్లో కొంతమేర మార్పులు కనిపించాయి. బ్యాంకుల వద్ద పెద్ద సంఖ్యలో క్యూలైన్లు కనిపించలేదని ఆర్బీఐ గవర్నర్ తెలియజేశారు. ముందుగా నిర్ణయించిన సమయంలోపలే రూ. 2 వేల నోట్లు వెనక్కి వచ్చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు శక్తికాంత్ దాస్. ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లపై కూడా కీలక సూచనలు చేశారు. ద్రవ్యోల్బణం ప్రస్తుతం అదుపులోనే ఉందని, అంతర్జాతీయ అంశాలు దీనిని ప్రభావితం చేస్తున్నాయని అన్నారు. అమెరికా వంటి దేశాలు కూడా ప్రస్తుతం ఈ ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నాయి. రష్యా ఉక్రెయిన్ వార్ ఆ రెండు దేశాలనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సగానికిపైగా దేశాలపై ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావం చూపుతున్నాయి.
2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ది 8.7 శాతం ఉండగా, 2022-23లో ఈ వృద్ధి 7 శాతానికిపైగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు ఆర్బీఐ గవర్నర్ తెలియజేశారు. మార్చి త్రైమాసికంలో ఆర్థిక రంగాలకు ఉత్తేజం లభించిందని, ఆన్నిరకాల ఆర్థిక రంగాలు పురోగమిస్తున్నాయని మార్చి త్రైమాసికంలో 7 శాతానికిపైగా వృద్ధి నమోదయ్యే అవకాశం ఉంటుందని శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. అంతర్జాతీయ అంశాలను అనుసరించి ద్రవ్యోల్బణం ఉంటుందని, ఏప్రిల్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.7 శాతానికి తగ్గింది. 18 నెలల కనిష్టానికి నమోదంది. ఇది శుభపరిణామమే. రాబోయే రోజుల్లో ఇది మరింత తగ్గే అవకాశం ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ తెలియజేశారు. వడ్డీ రెట్ల పెంపుదలపై ఇప్పట్లో ఏమీ చెప్పలేమని, ద్రవ్యోల్బణం, ఇతర ఆర్థిక అంశాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని అన్నారు. గత కొంతకాలంగా వడ్డీరేట్లు యధాతథంగా కొనసాగుతున్నాయి. ద్రవ్యోల్భణాన్ని అదుపులో ఉంచాలంటే వడ్డీ రేట్లు పెంచాలనే డిమాండ్ పెరుగుతున్నది. అయితే, సామాన్యులను దృష్టిలో ఉంచుకొని వడ్డీరేట్ల పెంపుపై ఆర్బీఐ చాలా కాలంగా నిర్ణయం తీసుకోకుండా ఉండిపోయింది.