RBI Fine to Amazon Pay: అమెజాన్‌కు ఆర్బీఐ భారీ షాక్… భారీ జరిమానా విధింపు
RBI Fine to Amazon Pay: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ పేకు ఆర్బీఐ షాకిచ్చింది. ఆర్బీఐ రెగ్యులేటరీ నిబంధనలు ఉల్లంఘించినందుకు భారీ జరిమానా విధించింది. ప్రీపెయిడ్ పెమెంట్స్, కేవైసీ నిబంధనలను అమెజాన్ సంస్థ ఉల్లంఘించడంతో ఈ జరిమానాను విధిస్తున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. కేవైసీ నిబంధనల విషయంలో ఆర్బీఐ విధించిన నిబంధనలకు కట్టుబడి లేనందున అమెజాన్ సంస్థకు రూ. 3.06 కోట్ల రూపాయల జరిమానాను విధించినట్లుగా ఆర్బీఐ తెలియజేసింది. అయితే, జరిమానాను ఎందుకు విధించకూడదో తెలియజేయాలని పేర్కొంటూ ఆర్బీఐ ముందుగానే అమెజాన్ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
ఈ షోకాజ్ నోటీసులకు అమెజాన్ సంస్థ ఇచ్చిన వివరణ తరువాతే తాము నిర్ణయానికి వచ్చి జరిమాన విధించినట్లుగా ఆర్బీఐ తెలియజేసింది. ప్రస్తుతం దేశంలో చెల్లింపులన్నీ డిజిటల్ విధానంలోనే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెజాన్ సంస్థ డిజిటల్ చెల్లింపులకు సంబంధించి తప్పనిసరిగా కొన్ని నిబంధనలను విధించింది. ఆ నిబంధనలకు లోబడే ఆయా సంస్థలు పేమెంట్ గేట్‌వేలను నిర్వహించాలని ఆర్బీఐ తెలియజేసింది. దేశంలో ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ద్వారా ఎక్కువ మొత్తంలో చెల్లింపులు జరుగుతుండగా, అమెజాన్ వాటా కేవలం 1 శాతం మాత్రమే ఉండటం విశేషం.