Punjab National Bank New Alert: కొత్త రూల్స్… రూ. 5 లక్షల మించితే పీపీఎస్ తప్పనిసరి
Punjab National Bank New Alert: ప్రభుత్వ రంగ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొత్త రూల్స్‌ని తీసుకొచ్చింది. బ్యాంకు ఖాతా దారులను మోసాల నుండి కాపాడేందుకు కొత్త రూల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది. రూ. 5 లక్షలకు మించి చెక్కుల రూపంలో చెల్లించే సమయంలో పీపీఎస్‌ను ఇవ్వాలనే రూల్‌ను తీసుకొచ్చింది. ఈ రూల్ ఏప్రిల్ 5 వ తేదీ నుండి అమలులోకి రానున్నది. గతంలో 10 లక్షలకు మించి చెక్కులకు ఈ పీపీఎస్ విధానం అమలులో ఉండేది. కాగా, ఈ విధానాన్ని ఇప్పుడు రూ. 5 లక్షలకు సైతం అమలు చేయాలని నిర్ణయించింది.
రూ. 5 లక్షల రూపాయలను చెక్కుల రూపంలో చెల్చించే సమయంలో వినియోగదారుడు కస్టమర్ ఖాతా నెంబరును, పేరును, చెక్ నెంబరు, మొత్తం చెల్లింపుల వివరాలను పీపీఎస్‌లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధానం ఆన్‌లైన్ లేదా బ్రాంచ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ లేదా ఎస్ఎంఎస్ రూపంలో ఒకరోజు ముందుగా తెలియజేయాల్సి ఉంటుంది. ఈ వివరాలను సబ్మిట్ చేయకుంటే ఆ చెక్కులు క్లియరెన్స్ కాబడవు. ఇక ఆర్బీఐ నిబంధనలను అనుసరించి 50 వేల రూపాయల పైబడిన చెక్కులకు పీపీఎస్ ను అమలులోకి తీసుకొచ్చినా, 5 లక్షలలోపు చెల్లింపులకు తప్పనిసరి కాదని, వివరాలు సబ్మిట్ చేయడం చేయకపోవడం వినియోగదారుల ఇష్టంపై ఆధారపడి ఉంటుందని పంజాబ్ నేషనల్ బ్యాంక్ తెలియజేసింది. అయితే, 5లక్షల చెక్కులకు మాత్రం తప్పనిసరిగా పీపీఎస్ రూల్స్ అమలౌతాయని స్పష్టం చేసింది.