Phone Pe: ట్రిలియన్ డాలర్ల మార్కు చేరుకున్న ఫోన్ పే లావాదేవీలు
PhonePe Reaches USD 1 trillion Annualised Payment Value Run Rate
డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ ఫామ్ ఫోన్ పే అరుదైన ఘనత సాధించింది. యూపీఐ లావాదేవీలు ఒక ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దేశ వ్యాప్తంగా పిన్ కోడ్ కలిగి ఉన్న 99 శాతం ప్రాంతాను కవర్ చేసింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కంపెనీ కన్జ్యూమర్ బిజినెస్ హెడ్ సోనికా చంద్ర ఓ ప్రకటన విడుదల చేశారు.
TPV రన్ రేట్ ఒక ట్రిలియన్ డాలర్లకు చేరడంతో కంపెనీ హెడ్ సంతోషం వ్యక్తం చేశారు. యూపీఏ పేమెంట్స్ పెరుగుదలకు మరిన్ని సేవలను కూడా చేర్చుతున్నట్లు సోనికా చంద్ర తెలిపారు. యూపీఐ లైట్, యూపీఐ ఇంటర్నేషనల్, క్రెడిట్ ఆన్ యూపీఐ వంటి సేవలు త్వరలో ప్రారంభం కానున్నట్లు ఆమె వివరించారు.
యూపీఐ విభాగంలో 50 శాతం మార్కెట్ షేర్ కలిగి ఉండడంతో ఈ అరుదైన ఘనత సాధ్యపడిందని కంపెనీ తెలిపింది. అదే విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పేమెంట్ యాగ్రిగేటర్ అనుమతులు కూడా మంజూరైనట్లు కూడా కంపెనీ ఒక ప్రకటనలో తెలిపారు.
#PhonePe gets payment #aggregator #licence, reaches $1 trillion annualised #Payment value run rate pic.twitter.com/VyZD8scadx
— KIRAN CHAUDHARI (@kiran98789) March 11, 2023
Phone Pe