OTT Market in India: ఇండియా ఓటీటీ మార్కెట్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
OTT Market in India growing rapidly, according to market surveys
ఓటీటీ (ఓవర్ ది టాప్) మార్కెట్ భారత దేశంలో శరవేగంగా పెరుగుతోంది. కరోనా కాలంలో మొదలైన ఓటీటీల జోరు ఇంకా కొనసాగుతోంది. వీక్షకుల అభిరుచులకు తగ్గట్లు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాయి. తమవైపు తిప్పకుంటున్నాయి. ఓటీటీకి అలవాటు పడిన కొంత మంది ఏకంగా థియేటర్ల వైపు చూడడం మానేశారు. ఎంచక్కా ఇంట్లోనే కూర్చుని కొత్త కొత్త సినిమాలను, వెబ్‌సిరీస్‌లను చూస్తున్నారు. ఖర్చు తక్కువ ఎంజాయ్ మెంట్ ఎక్కువ అనే పాలసీతో ఓటీటీలు ముందుకు వెళుతున్నాయి.
ఓటీటీల విషయంలో ప్రఖ్యాతి గాంచిన ఓర్మాక్స్ (Ormax) సంస్థ నిర్వహించిన సర్వేలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. 2021 నుంచి 2022 కాలంలో భారతదేశంలో ఓటీటీ సబ్‌స్ర్కైబర్ల సంఖ్య 20 శాతం పెరిగినట్లు వెల్లడించింది. ఆ సంఖ్య 424 మిలియన్లకు చేరింది. అదే 42 కోట్ల 4 లక్షల మంది భారతదేశంలో ఓటీటీలను ఆదరిస్తున్నారు.
భారతదేశంలో ఉన్న ఆరు మెట్రో నగరాలలో ఎక్కువ మంది ఓటీటీ వినియోగదారుల జాబితాలో ఉన్నారు. మొత్తం
కరోనా కాలంలో చాలా మంది ఓటీటీలకు అలవాటు పడ్డారు. కొంత కాలం పాటు థియేటర్లు మూత పడడంతో దేశంలో అన్ని ప్రాంతాల ప్రజలు వినోదం కోసం ఓటీటీబాట పట్టారు. స్ట్రీమింగ్ సంస్థలు కూడా ఆకర్షణీయమైన ప్యాకేజీలతో వీక్షకులను ఆకట్టుకున్నాయి. నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, అమేజాన్ ప్రైమ్‌లతో పాటు లోకల్ ఓటీటీలు కూడా ప్రాచుర్యం పొందుతున్నాయి. తెలుగులో ఆహా కూడా వీక్షకులను ఆకట్టుకునే కంటెంట్‌తో అలరిస్తోంది. అల్లుఅరవింద్ ఆలోచలకు అనుగుణంగా ఆహా సంస్థలో పనిచేసే సిబ్బంది సరైన రీతిలో ముందుకు వెళుతున్నారు.
కరోనా మహమ్మారి ఉధృతి తగ్గి తిరిగి జనాలుథియేటర్ల వైపు పరుగులు పెడుతున్న ప్రస్తుతం కాలంలో ఓటీటీ మార్కెట్ ఎలా ఉండనుందనే విషయం రానున్న రోజుల్లో తేలనుందని సర్వే సంస్థ ఓర్మాక్స్ మీడియా సీఈఓ శైలేష్ కపూర్ తెలిపారు.
మెట్రో నగరాల్లో అనుకున్న స్థాయిలో ఓటీటీ చొరబడిందని, చిన్న చిన్ననగరాలకు ఇంకా వ్యాప్తి చెందాల్సిన అవసరం ఉందని శైలేష్ కపూర్ తెలిపారు.
ఒకప్పుడు దేశంలో కేవలం దూరదర్శన్ మాత్రమే కొన్ని వినోద కార్యక్రమాలను అందించేది. ఎక్కువుగా హిందీ కార్యక్రమాలే ప్రసారం అయ్యాయి. ఆ తర్వాత కాలంలో దూరదర్శన్ మార్పులు జరిగాయి. వివిధ భాషలకు చెందిన ఛానెల్స్ రావడం మొదలయింది. ఛానెళ్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. డైరెక్ట్ టు హోం (DTH) మార్కెట్ విస్తరించింది. ప్రస్తుతం ఓటీటీల కాలం నడుస్తోంది.
మొత్తం భారతదేశంలో దాదాపుగా 46 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు తమ కంటెంట్‌తో వీక్షకులకు వినోదాన్ని అందిస్తున్నాయి. దేశంలో క్రమక్రమంగా ఓటీటీ వీక్షకుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం 45 కోట్ల దగ్గర ఉన్న ఆ సంఖ్య ఈ ఏడాది చివరి నాటికి 50 కోట్లకు చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు ఓటీటీ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
2018లో 2590 కోట్లుగా ఉన్న ఓటీటీ వ్యాపారం 2023 చివరి నాటికి 12,000 కోట్లకు చేరనున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో ఇంటర్నెట్ వినియోగం ఎక్కువ కావడం కారణంగానే ఓటీటీ మార్కెట్ గణనీయంగా పెరిగింది. ఓటీటీల కమర్షియల్ ప్రకటనలు లేకుండానే ఓటీటీలో కార్యక్రమాలు స్ట్రీమింగ్ కావడం వీక్షకులకు అద్భుత అవకాశంగానే చెప్పవచ్చు. టీవీలలో వచ్చే సినిమాలు ప్రకటనలతో విసుగెత్తిస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో యాడ్స్ లేకుండా ఓటీటీలలో వచ్చే కార్యక్రమాలు పూర్తిస్థాయి వినోదాన్ని అందిస్తున్నాయి.