Meta: ఉద్యోగులకు షాకుల మీద షాకులు ఇస్తున్న మెటా కంపెనీ
Meta withdrawns around 20 full-time job offers, hints at slowing hiring in 2023
ఫేస్ బుక్ పేరెంట్ కంపెనీ మెటా మరో కీలక నిర్ణయం తీసుకుంది. 20 మంది ఉద్యోగులకు ఇచ్చిన పుల్ టైమ్ జాబ్ ఆఫర్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. తన ఉద్దేశ్యాన్ని మరోసారి స్పష్టంగా చాటి చెప్పింది. ఈ ఏడాదిలో కూడా కోతలు తప్పవని క్లారిటీ ఇచ్చింది. ఉద్యోగ నియామక ప్రక్రియలు ఇంతకు ముందులా ఉండవని చెప్పకనే చెప్పింది.
గత ఏడాది ఏకంగా 11 వేల మందిని ఇంటికి పంపిన మెటా..ఈ ఏడాది కూడా అదే బాటలో నడవనున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఫుల్ టైమ్ జాబ్ ఆఫర్ ఇచ్చిన 20 మంది నుంచి కూడా ఆఫర్ లెటర్లు వెనక్కి తీసుకుందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
కొత్త ఉద్యోగాల కల్పన అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తామని కంపెనీ ప్రతినిధులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ ప్రకటనలను బట్టి చూస్తే ఈ ఏడాదిలో ఉద్యోగ నియామకాలు చాలా చాలా తక్కువుగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
జాబ్ ఆఫర్లను వెనక్కి తీసుకోవడం అనే ప్రక్రియ మెటా కంపెనీలో మొట్టమొదటి సారి జరిగినట్లు టెక్ కంపెనీ ప్రముఖులు చెబుతున్నారు. సంతకాలు చేసిన FTE ఆఫర్ లెటర్లు వెనక్కి తీసుకోవడం చాలా అరుదైన విషయమని అంటున్నారు.
ప్రఖ్యాత ఈ కామర్స్ కంపెనీ అమేజాన్ తన సంస్థకు చెందిన 18 వేల మందిని ఇంటికి పంపుతోంది. జనవరి 18 నుంచి విడతల వారీగా కోతలు మొదలు కానున్నాయి. దశల వారీగా పూర్తికానున్నాయి. ఇంటికి పంపుతున్న వారికి సరైన ప్యాకేజీ ఇవ్వడం ద్వారా వారిని శాంతపరుస్తున్నారు.