Maruti Suzuki Recall 17362 Cars: మారుతీ కార్లలో ఎయిర్ బ్యాగ్స్ లో లోపం… 17 వేల కార్లు రీకాల్
Maruti Suzuki Recall 17362 Cars: ప్రముఖ కార్ల దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ కీలక నిర్ణయం తీసుకున్నది. కార్లలోని ఎయిర్ బ్యాగ్స్‌లో చిన్న సాంకేతిక లోపం గుర్తించామని, వాటిని వెంటనే సరిచేసి పంపుతామని, ఆ కార్లను వెనక్కి ఇవ్వాలని కోరింది. 17,362 కార్లను రీకాల్ చేస్తున్నట్లు మారుతీ సుజుకీ సంస్థ తెలియజేసింది. ఆల్టో 10 కె, బాలెనో, ఎస్‌ప్రెసో, ఈకో, గ్రాండ్ విటారా మోడళ్లలో సుమారు 17 వేలకు పైగా కార్లలో ఎయిర్ బ్యాగ్స్‌లో లోపాలు గుర్తించారు. లోపాలు గుర్తించిన కార్లను వెంటనే రీకాల్‌కు ఆదేశించారు.
2022 డిసెంబర్ 8వ తేదీ నుండి 2023, జనవరి 12 వ తేదీ మధ్యలో తయారైన కార్లలో సాంకేతిక లోపం గుర్తించినట్లు ఆ సంస్థ తెలియజేసింది. ఎలాంటి చార్జీలు వసూలు చేయకుండా ఈ లోపాన్ని సవరించి ఇస్తామని మారుతీ సుజుకీ తెలిపింది. లోపాన్ని సవరించకుంటే సీట్‌బెల్ట్, ఎయిర్ బ్యాగ్స్ పనిచేయపోవచ్చని, డిసెంబర్8 నుండి జనవరి 12 వ తేదీ మధ్య తయారైన కార్లను వెంటనే వెనక్కి ఇవ్వాలని తెలియజేసింది. ఈ రెండు తేదీల మధ్య తయారైన కార్లను ఎవరైనా కొనుగోలు చేస్తే వారికి కూడా కంపెనీ నుండి కాల్ వస్తుందని, లోపం ఉన్న కార్లను నడపవద్దని మారుతీ సుజుకీ సంస్థ వినియోగదారులకు సూచించింది.