కార్ల ధరలపై మారుతీ సుజుకి కీలక నిర్ణయం
ఇండియాలో అధికంగా అమ్ముడు అవుతున్న ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి సంచలన నిర్ణయం తీసుకుంది. కార్ల తయారీకి సంబంధించి ఉత్సాదక ఖర్చుల పెరుగుదలను దృష్టిలో ఉంచికొని కార్ల ధరలను 1.3 శాతం పెంచుతున్నట్లు మారుతీ సుజుకీ ప్రకటించింది. పెరిగిన ధరలు నేటి నుంచే అమలులోకి వస్తాయని సంస్థ తెలిపింది.
గత ఏడాది వివిధ ఇన్‌పుట్ ఖర్చులు పెరిగాయని, దీని వల్ల కార్ల ధరలు పెంచక తప్పలేదని ఆ సంస్థ తెలిపింది. ధరలు పెంచిన తర్వాత కార్ల తయారీ దారు షేర్లు 0.2 శాతం తగ్గాయని తెలిపింది. మరోవైపు గత ఆర్థిక సంవత్సరంలో కార్ల విక్రయాల్లో మారుతీ సుజుకి టాప్ ప్లేస్‌లో ఉండగా.. హ్యుందాయ్ మోటార్, కియా వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.