Stock Markets : నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
Stock Markets Today Update: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిసాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం వరకు పరిమిత లాభాలతో కదలాడాయి. తర్వాత అమ్మకాల ఒత్తిడితో పూర్తిగా నష్టాల్లోకి జారుకొని ఇంట్రాడే కనిష్ఠాలను నమోదు చేశాయి. చమురు ధరలు 100 డాలర్ల దిగువకు చేరడంతో ఉదయం సెషన్‌లో మార్కెట్లు కాస్త ఉత్సాహంగా కదిలాయి. కానీ, రూపాయి బలహీనత, బొగ్గు దిగుమతుల పెరుగుదల వంటి ప్రతికూలాంశాలు గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణకు దోహదం చేశాయి. ఇవాళ రిలయన్స్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టాలను చెవి చూశాయి. సూచీల సెంటిమెంటును దెబ్బతీసింది.
ఉదయం సెన్సెక్స్ 54 వేల 210 వద్ద లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించగా.. నిఫ్టీ 16 వేల 140.00 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 54,211.22 – 53,455.26 మధ్య కదలాడింది. చివరకు 372.46 పాయింట్లు నష్టపోయి 53,514.15 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 91.65 పాయింట్లు నష్టపోయి 15,966.65 వద్ద నిలిచింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో రూపాయి మారకం విలువ రూ.79.5గా ఉంది.
సెన్సెక్స్ 30 సూచీలో ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటన్, ఎంఅండ్‌ఎం షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. హెచ్‌యూఎల్, ఏషియన్ పెయింట్స్, సన్‌ఫార్మా, కొటాక్ మహీంద్రా బ్యాంక్, సన్‌ఫార్మా, కొటాక్ మహీంద్రా బ్యాంక్, ఎన్‌టీపీసీ, నెస్లే ఇండియా, పవర్‌గ్రిడ్, ఇన్ఫోసిస్, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్స్, యాక్సిస్ బ్యాంక్ లాభపడ్డ షేర్ల జాబితాలో ఉన్నాయి.