Stock Markets: నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
Stock Markets Today Update: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత మళ్లీ పుంజుకోలేదు. ఆర్థికమాంద్యం భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలహీనపరిచాయి. దీంతో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 497 పాయింట్లు నష్టపోయి 55,268కి పడిపోగా.. నిఫ్టీ 147 పాయింట్లు కోల్పోయి 16,483కి దిగజారింది.
బజాజ్ ఫిన్ సర్వ్ 5.47 శాతం లాభ పడగా.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 0.47 శాతం, భారతి ఎయిర్ టెల్ 0.63 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.46శాతం, ఐటీసీ 0.42 శాతం లాభాలను అర్జించి టాప్ గెయినర్స్‌గా నిలువగా.. ఇన్ఫోసిస్ -3.45 నష్టాన్ని చవి చూసింది. హిందుస్థాన్ యూనిలీవర్ -2.98 నష్టపోగా.. యాక్సిస్ బ్యాంక్ -2.93 శాతం, డాక్టర్ రెడ్డీస్ -2.75 శాతం, కోటక్ మహీంద్రా బ్యాంక్ -2.28 శాతం నష్టపోయి టాప్ లూజర్స్‌గా నిలిచాయి. జొమాటో షేర్ల పతనం వరుసగా రెండోరోజూ కొనసాగింది. జొమాటో ఈరోజు 11 శాతానికి పైగా నష్టపోయి సరికొత్త జీవితకాల కనిష్ఠాన్ని నమోదు చేసింది. దీంతో రెండు రోజుల్లో ఈ షేరు 23 శాతానికి పైగా నష్టపోయింది.