Goldman Sachs: 3200 ఉద్యోగులను ఇంటికి పంపనున్న గోల్డ్ మెన్ సాచెస్
Layoffs in Goldman Sachs, IITians, IIMs are mostly affected
గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ గోల్డ్ మెన్ శాచెస్ ఉద్యోగులకు ఉధ్వాసన పలకడం ప్రారంభించింది. సంస్థలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగులలో 6.5 శాతం మంది ఉద్యోగులకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకుంది. సంస్థ తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపుగా 3200 మంది రోడ్డున పడనున్నారు. వారిలో ఎక్కువ మంది భారతీయ ఉద్యోగులేనని తెలుస్తోంది.
ఐఐటీయన్లు, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదివి గోల్డ్ మెన్ శాసెస్ లో ఉద్యోగం సంపాదించిన ఎందరో భారతీయ ఉద్యోగులు ప్రస్తుతం ఆ సంస్థ నుంచి ఉధ్వాసనకు గురౌతున్నారు. వివిధ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గోల్డ్ మెన్ సాచెస్ సంస్థలో ఉద్యోగులను ఎలా తొలగిస్తున్నారనే విషయాన్ని కార్పోరేట్ చాట్ అనే ట్విట్టర్ అకౌంట్ కళ్లకు కట్టినట్లు వివరించింది.అర్జెంట్ పని ఉందని చెబుతూ కాన్ఫరెన్స్ హాల్ లోకి పిలుస్తున్నారని, ఉద్యోగం నుంచి తొలగించినట్లు చెబుతున్నారని, కాన్ఫరెన్స్ హాల్ నుంచి తిరిగి తన డెస్క్ వద్దకు కూడా కనీసం వెళ్లనీయడం లేదని కార్పోరేట్ చాట్ వెల్లడించింది.
Scary stuff at Goldman Sachs India: Employees are being asked to go to a conference room, told that they’re laid off and asked to leave immediately without being allowed to go back to their desk
Started a while ago with a 10 person layoff. But now 100s are expected to be cut pic.twitter.com/X938Se944Z
— Corporate Chat India (@anonCorpChatInd) January 12, 2023
గోల్డ్ మెన్ సాచెస్ హైదరాబాద్ బ్రాంచ్ కన్జ్యూమర్ బ్యాంకింగ్ డివిజన్ లో పనిచేస్తున్న 10 మందిని తొలగించారు.అకస్మాత్తుగా విధుల నుంచి తొలగించడంపై వారందరూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో టెక్సాస్ లో గోల్డ్ మెన్ సాచెస్ లో పనిచేసిన షిల్పి సోనీ కూడా తన ఆవేదనను లింక్డ్ ఇన్ ద్వారా వ్యక్తం చేసింది.