Ola layoffs: కొత్త ఏడాదిలో కోతల పర్వం, 200 మందిని ఇంటికి పంపిన ఓలా గ్రూప్
layoffs continue in Ola Company, fires 200 employees
ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ కంపెనీలు ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి. గత ఏడాదిలో ప్రారంభమైన కోతల పర్వం కొత్త ఏడాదిలో కూడా కొనసాగుతోంది. అనేక కంపెనీలు ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి. తాజాగా ఓలా కంపెనీ 200 మందిని ఇంటికి పంపింది.
ఓలా సంస్థ 2022లో ఏకంగా 1100మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. కాస్ట్ కటింగ్ విధానం అవలంభించడం ద్వారా అనేక మందిని ఇంటికి పంపుతోంది. తాజాగా తీసుకున్న నిర్ణయం కారణంగా ఓలా క్యాబ్స్, ఓలా ఎలక్ట్రిక్, ఓలా పైనాన్సియల్ సర్వీసెస్ విభాగాల్లో పనిచేస్తున్న వారిపై ప్రభావం పడింది.
ఓలా కంపెనీ ఇటీవలే కొనుగోలు చేసిన అవైల్ ఫైనాన్సియల్ యాప్ సేవలను కూడా రద్దు చేయనుంది. అవైల్ ఫైనాన్సియల్ సర్వీస్ సేవలను ఓలా మనీలో విలీనం చేయనుంది. ఇంజనీరింగ్, డిజైన్ విభాగాల్లో కొత్త వారిని తీసుకుంటామని కూడా సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఉద్యోగాల నుంచి తొలగిస్తున్న వారికి మంచి నిబంధనల ప్రకారం మంచి ప్యాకేజీ ఇస్తున్నట్లు ఓలా సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
గత కొన్నినెలలుగా ఓలా కంపెనీ ఉద్యోగులను ఇంటికి పంపడంతో పాటు తమకు భారంగా నిలిచిన విభాగాల సేవలను కూడా నిలిపివేస్తూ వస్తోంది. భారంగా మారిన ఓలా ప్లే యూనిట్ ను మూసివేసింది. అదే విధంగా ఓలా కార్స్, ఓలా డ్యాష్ విభాగాల సేవలను కూడా పూర్తిగా మూసివేసింది.