WEF 2023: కేటీఆర్ కు అరుదైన ఘనత, సోషల్ మీడియా ప్రభావిత జాబితాలో స్థానం
KTR is on top 30 social media influencers at WEF 2023
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అరుదైన ఘనత దక్కించుకున్నారు. కె కోర్ అనలిటిక్స్ అనే సంస్థ రూపొందించిన సోషల్ మీడియా ప్రభావితుల జాబితాలో టాప్ 30లో నిలిచారు. ఈ జాబితాలో భారత దేశం నుంచి కేటీర్ ఒక్కరే ఉండడం గమనార్హం. ఈ 30 మంది జాబితాలో కేటీఆర్ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాతో పాటు మినిస్టర్ కేటీఆర్ అనే పేరుతో ఉన్న మరో అకౌంట్ కూడా జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
కె కోర్ అనలిటిక్స్ అనే సంస్థ రూపొందించిన ఈ జాబితాలో కేటీఆర్ వ్యక్తిగత అకౌంట్ 13వ స్థానంలో నిలవగా, అధికారిక అకౌంట్ 25వ స్థానంలో నిలిచింది.
ప్రస్తుతం దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు. ఆ సదస్సులో పాల్గొన్న వారి గురించి వివరాలు సేకరించి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రభావవంతంగా ఉన్న వారి జాబితాను కె కోర్ అనలిటిక్స్ తయారు చేసింది.
Top 30 Influencers for the World Economic Forum @GretaThunberg@vanessa_vash@SumakHelena@wef@NazaninBoniadi@Davos@hedera@femalequotient@MarshMcLennan@Zurich@JimHarris@KTRTRS@WHO@Thomas_Binder@AveryDennison
via KCORE Analytics#WEF23 #WEF #Davos #socialmedia #smm pic.twitter.com/KB1rfiOr4Q
— Jim Harris #WEF23 (@JimHarris) January 16, 2023
ktr