వినియోగదారుడిపై వస్తున్న సగటు ఆదాయాన్ని పెంచుకునేందుకు రిలయన్స్ జియో(Reliance Jio) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రీపెయిడ్‌లో(Prepaid) ఇప్పటివరకు ఉన్న ప్రాథమిక రీఛార్జ్ ప్లాన్ (Basic Recharge Plan)రూ.119ని నిలిపివేసింది.
Reliance Jio : వినియోగదారుడిపై వస్తున్న సగటు ఆదాయాన్ని పెంచుకునేందుకు రిలయన్స్ జియో(Reliance Jio) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రీపెయిడ్‌లో(Prepaid) ఇప్పటివరకు ఉన్న ప్రాథమిక రీఛార్జ్ ప్లాన్ (Basic Recharge Plan)రూ.119ని నిలిపివేసింది. ఇకనుంచి జియో యూజర్లు (Jio Users)రీఛార్జ్ చేసుకోవాలంటే రూ.149 వెచ్చించాల్సి ఉంటుంది. జియో ఈ నిర్ణయం తీసుకోకముందు వరకు రూ.119 ప్రైమరీ ప్లాన్‌గా(Primary plan) ఉండేది.
ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 14 రోజులపాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్ లు ఇచ్చేవారు. అయితే దీన్ని తొలగించి రూ.149 ప్లాన్‌ను ప్రైమరీ ప్లాన్ చేశారు. అయితే ఇందులో కాస్తంత వెసులుబాటును అందించారు. 14 రోజుల గడువును 20 రోజులకు పెంచడంతోపాటు రోజుకు 1 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు ఇస్తున్నారు. వీటితోపాటు జియో టీవీ యాప్, జియో సినిమాల్లో కార్యక్రమాలు వీక్షించవచ్చు. అయితే ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ 5G డేటా మాత్రం ఉండదని గుర్తుంచుకోవాలి.
కొన్నిరోజుల కింద జియో.. ప్రీపెయిడ్ యూజర్లకు నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో తొలిసారి రెండు ప్లాన్లు విడుదల చేసింది. దీంట్లో ఒక ప్లాన్ ధర రూ.1099 కాగా.. 84 రోజుల వ్యాలిడిటీ, డైలీ 2GB డేటా, అపరిమిత కాల్స్ వస్తాయి. నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్ లభిస్తుంది. మరో ప్లాన్ ధర రూ.1499గా ఉంది. దీని వ్యాలిడిటీ 84 రోజులతోపాటు అన్‌లిమిటెడ్ కాల్స్, డైలీ 3GB డేటా వస్తుంది. బేసిక్ నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ వస్తుంది.
జియో వెల్‌కం ఆఫర్ కింద ఉచితంగా 5G డేటా లభిస్తుంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్ ధర నెలకు రూ.149 కాగా.. బేసిక్ ప్లాన్ ధర రూ.199గా ఉంది. జియోకు ఈ మధ్యకాలంలో వినియోగదారులు విపరీతంగా పెరిగారు. 2.27 మిలియన్లమంది రాగా, ఎయిర్ టెల్‌కు 1.4 మిలియన్ల మంది వచ్చారు.