Jawa Yezdi: ఉమెన్స్ డే స్పెషల్, బైక్ రైడింగ్ ఏర్పాటు చేసిన యెజ్డీ కంపెనీ
Jawa Yezdi organizes rides for women in many parts of India
మహిళా దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా అనేక ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రఖ్యాత మోటర్ సైకిల్ కంపెనీ యెజ్డీ కూడా ఆ జాబితాలో చేరింది. మహిళలకు దేశ వ్యాప్తంగా బైక్ రైడ్ ఏర్పాటు చేసింది. ఢిల్లీ, బెంగళూర్, పూణె, చెన్నై, గౌహతి, గౌహతి వంటి నగరాల్లో ఈ బైక్ రైడ్ ప్రోగ్రాంను మార్చి 5న ప్రారంభించింది. ఎందరో ఉత్సాహవంతులైన యువతులు ఈ బైక్ రైడ్ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. జాలీ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. అదే విధంగా ఓ మెసేజ్ కూడా ప్రజల్లోకి బలంగా తీసుకువెళుతున్నారు.
బహిస్టు సమయంలో పాటించాల్సిన శుభ్రతపై ఈ బైక్ రైడర్లు కొన్ని ప్రాంతాల్లో పర్యటించి వివరించనున్నారు. వారిలో పలు అనుమానాలను నివృత్తి చేయనున్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన బైక్ రైడింగ్ ప్రోగ్రాంలో ప్రఖ్యాత రైడర్ గరిమా అవతార్ పాల్గొన్నారు. ఈమె రాకతో మిగతా రైడర్లు కూడా అత్యంత ఉత్సాహంతో పాల్గొన్నారు.
మహిళా పోలీసులకు చీరల బహుమతి
మహిళా దినోత్సవం సందర్భంగా ఎస్ఆర్ నగర్ పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న మహిళలకి చీరలు పంచి పెట్టారు ఇన్స్పెక్టర్. 25 మంది మహిళా సిబ్బందికి ఖరీదైన చీరలు అందజేశారు.