ITC Salaries: ఐటీసీలో భారీగా పెరిగిన వేతనాలు..220 మందికి కోటికి పైగా వేతనం..!
ITC employees salaries: ఐటీసీలో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలు భారీ స్థాయిలో పెరిగాయి. 2020-21తో పోలిస్తే, 2021-22 వ సంవత్సరంలో వేతనాల సంఖ్య 44 శాతం పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. 2020-21లో వార్షిక వేతననం కోటి రూపాయలకు పైగా తీసుకునేవారి సంఖ్య 153 మంది ఉండగా, 2021-22 లో ఈ సంఖ్య 220కి చేరింది. ఇక ఐటీసీ ఎండీ సంజీవ్‌పురి వేతనం 2020-21లో 11.95 కోట్లు ఉండగా, 2021-22లో వార్షిక స్థూల వేతనం 5.35 శాతం పెరిగి 12.59 కోట్లకు చేరింది. ఇకపోతే, 2020-21తో పోలిస్తే, 2021-22 సవంత్సరంలో ఉద్యోగుల సంఖ్య 8.4 శాతం పెరిగి 23,889కి చేరింది. ఇందులో 21,568 మంది పురుషులు ఉంటే, 2,261 మంది మహిళలు ఉన్నారు. పర్మినెంట్ ఉద్యోగులతో పాటు వివిధ విభాగాల్లో 25,513 మంది నాన్ పర్మినెంట్ కేటగిరిలో పనిచేస్తున్నారు. వీరి వేతనాలు కూడా 7 శాతం పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. అదేవిధంగా ఐటీసీలోని ముఖ్యమైన విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలు 8శాతం పెరినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రికార్డుస్ధాయిలో కంపెనీ రూ. 24,000 కోట్ల టర్నోవర్ సాధించింది.