Isha ambani: ఆసియాలోనే అత్యంత కుబేరుల్లో ఒకరు రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ (Mukesh ambani). ఆయన పిల్లలు కూడా వ్యాపారాల్లో రాణిస్తూ తండ్రికి తగ్గ తనయులు అనిపించుకుంటున్నారు.
Isha ambani: ఆసియాలోనే అత్యంత కుబేరుల్లో ఒకరు రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ (Mukesh ambani). ఆయన పిల్లలు కూడా వ్యాపారాల్లో రాణిస్తూ తండ్రికి తగ్గ తనయులు అనిపించుకుంటున్నారు. ప్రస్తుతం అంబానీ కూతురు ఇషా (Isha ambani) అంబానీ చైనాకు చెందిన ఓ ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్‌ను (Fashion brand) ఇండియాకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఆ బ్రాండ్‌ను గతంలో ఇండియా బ్యాన్ చేసింది.
ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ షీన్ను (shein) ఇండియాకు తీసుకొచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేశారు నీతూ అంబానీ. ఇందుకు సంబంధించి షీన్ కంపెనీతో రిటైల్ ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే గతంలో ఈ బ్రాండ్ భారత్‌లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తక్కవ కాలంలోనే మంచి ఆదరణ పొందింది. పలు అనివార్య కారణాల వల్ల షీన్ బ్రాండ్‌ను భారత్ 2020 జూన్‌లో బ్యాన్ చేసింది. ఆ బ్రాండ్ విక్రయాలను పూర్తిగా నిలిపివేసింది. అయితే నిషేధానికి గురైనప్పటికీ కోర్టు తుది తీర్పు వచ్చే వరకు ఈ కామర్స్ సైట్స్ ద్వారా తమ బ్రాండ్ ప్రొడక్ట్స్‌ను షీన్ విక్రయించింది. ఆ తర్వాత కోర్టు నోటీసులు జారీ చేయడంతో పూర్తిగా విక్రయాలను నిలిపివేసింది.
ఇక దాదాపు మూడు సంవత్సరాల తర్వాత షీన్ బ్రాండ్ భారత్‌కు వస్తోంది. ఇషా అంబానీ ఆ బ్రాండ్‌ను ఇండియాకు తీసుకొచ్చేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. అతి త్వరలో ఆ బ్రాండ్ ప్రొడక్ట్స్ భారతీయులకు అందుబాటులో ఉండనున్నాయి. ఇప్పటికే రిలయన్స్ భాగస్వామ్యంలో ఫేమస్ అంతర్జాతీయ బ్రాండ్స్ ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు షీన్ కూడా ఆ జాబితాలో చేరనుంది.