Nirmala Sitharaman: మధ్య తరగతికి సానుకూల సంకేతాలు..
I can understand Middle Class Pressures, says Finance Minister Nirmala Sithraman
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ త్వరలోనే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశంతో ప్రభావితమయ్యే అనేక వర్గాల ప్రజలు ఇటీవల కాలంలో ఆమె చెబుతున్న మాటలను జాగ్రత్తగా వింటున్నారు. బడ్జెట్ కి సంబంధించిన విషయాల్లో ఆమె నోటి నుంచి వచ్చే ప్రతి మాటకు ప్రాధాన్యత సంతరించుకుంటోంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సారధ్యంలో నడుస్తున్న వారపత్రిక పాంచజన్య ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.
తనకు మధ్యతరగతి ప్రజల జీవితాల గురించి తెలుసని, తాను కూడా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినేనని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆదాయపు పన్ను విధింపు విషయంలో కూడా నిర్మలా సీతారామన్ ఓ విషయం స్పష్టం చేశారు. సంవత్సరానికి 5 లక్షల రూపాయల ఆదాయం కలిగిన వారికి పన్ను నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపారు.
పాంచజన్య ఏర్పాటు చేసిన సభలో కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న అనేక పథకాల గురించి నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు. దేశంలో 27 నగరాల్లో మెట్రో రైల్ నెట్ వర్క్ ప్రారంభిస్తున్నామని, 100 నగరాలను స్మార్ట్ నగరాలుగా తీర్ది దిద్దుతున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు.
దేశంలో మధ్యతరగతి జనాభా పెరుగుతోందని, వారి అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేస్తోందని, రానున్న రోజుల్లో కూడా మరిన్ని కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.