ఆదాయం పన్ను చెల్లించకపోతే ఏం జరుగుతుంది?
income tax: పొద్దున లేచిన దగ్గర నుంచీ ఎక్కడో ఓ చోట ఇన్ కమ్ ట్యాక్స్ (income tax) వార్తలు వింటూనే ఉంటాం. ఇక ఫైనాన్సియల్ ఇయర్ ఎండ్ వచ్చిందంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదే నామస్మరణ చేస్తూ అమ్మో.. ఆదాయం పన్ను రిటర్న్ దాఖలు చేయాలి లేదంటే.. నా జీతం మొత్తం ఇన్ కమ్ ట్యాక్స్ కే పోతుందని కంగారు పడటం చూస్తుంటాం. అసలు ఆదాయపు పన్నులోకి ఎవరు వెళతారు. మీరు తప్పకుండా ఆదాయం పన్ను రిటర్న్ దాఖలు చేయాల్సిందేనా? చేయకపోతే ఏం జరుగుతుంది ఇలాంటి సందేహాలు చాలామందిలో ఉంటాయి. అయితే ఎవరినైనా అడిగితే ఉద్యోగం చేస్తున్నావు ఈ మాత్రం తెలియదా అని అడుగుతారని కొంతమంది ఆగిపోతే.. అసలు నీ కెందుకు ఇలాంటి అవసరం లేని ప్రశ్నలు అని అంటారని మరికొంతమంది ఆగిపోతుంటారు. కానీ ఇన్ కమ్ ట్యాక్స్ పై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలంటారు ఆర్ధిక నిపుణులు.
నిజానికి ఇప్పుడు 2022-2023 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన రిటర్న్ లు దాఖలు (Filing of return) చేసే టైమ్ వచ్చేసింది. ఆదాయం పన్ను చెల్లించడానికి ఆఖరు తేదీ జూలై 31 అని .. ఈ లోగానే రిటర్న్ దాఖలు చేయాలని చెబుతారు. అయితే అప్పుడప్పుడు మాత్రం ఈ గడువును పొడిగిస్తారు. అయితే ఇది ఎప్పుడూ ఉంటుందన్న నమ్మకం లేదు. కాబట్టి ఎప్పుడూ డెడ్ లైన్ ను క్రాస్ చేయకుండా ముందే మీ పనులు పూర్తి చేసుకుంటేనే మంచిది. ఒకవేళ అందులో ఏమైనా తప్పులుంటే సరిదిద్ది మళ్లీ అప్లై చేయడానికి ఉంటుంది.
మీరు మొదట ఇన్ కమ్ ట్యాక్స్ మొత్తం (Amount of income tax) చెల్లించినా.. మీకు దానిని రిఫండ్ రూపంలో తిరిగి పొందేందుకు అవకాశం ఉంటుంది. కాకపోతే మనం రిటర్న్ దాఖలు చేసినప్పుడు అన్ని పేపర్స్ సబ్మిట్ చేయాలి. అంటే మీ ఇంట్లో ఎల్ఐసీ వంటివి కడుతుంటే అవి ట్యాక్స్ బెనిఫిట్ లోకి వస్తుంది. అలాగే ఇంటి రుణం తీసుకున్నా.. పిల్లల ఎడ్యుకేషన్ లోన్ వంటివి తీసుకున్నా అవన్నీ ట్యాక్స్ రిఫండ్ కోసం ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు రిటర్న్ లు గడువులోపే దాఖలు (Late filing of returns) చేస్తే.. వడ్డీ సహా తిరిగి పొందొచ్చు. అలాగే డెడ్ లైన్ లోగా పన్నును చెల్లించకపోతే వడ్డీతో పాటు ఫైన్ కూడా ఉంటుంది. రూ.5 లక్షల లోపు ఆదాయం ఉంటే రూ.వెయ్యి, అంతకు మించి ఉన్నప్పుడు రూ.5,000 వరకూ జరిమానా విధిస్తారు. డిసెంబరు 31 తర్వాత ఈ మొత్తం రూ.10వేలు ఉంటుంది.
సాధారణంగా అప్పులు తీసుకునే సమయంలో బ్యాంకులు ట్యాక్స్ ను పరిగణనలోకి తీసుకుంటాయి. కనీసం 3 ఇయర్స్ ఫారం 16 అడగడంతో పాటు.. పన్ను రిటర్నులను మన ఇన్కమ్ ప్రూఫ్స్ గా అడుగుతాయి. హా ఎప్పుడో కదా అని లైట్ తీసుకుంటే.. అనుకోకుండా ఒక్కోసారి అత్యవసరం పడినప్పుడు ఇబ్బందులు పడతాం. అందుకే ప్రతి ఇయర్ తప్పకుండా ఆదాయం పన్నును గడువులోగా చెల్లించాలి ( Income tax must be paid on time).
అంతెందుకు చివరకు ఇతర దేశాలకు వెళ్లాలనుకున్నవాళ్లు వీసా కోసం ముందే అప్లై చేసుకుంటారు. అయితే వీసా ప్రాసెస్ లో ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేస్తే వీసా ఈజీగా దొరికే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆస్తులు, షేర్లు, ముచ్యువల్ ఫండ్స్ యూనిట్స్ అమ్మడం వల్ల ఒక వల్ల లాంగ్ టైమ్ లో నష్టాలు వస్తే దీనిని చూపిస్తూ రిటర్న్ దాఖలు చేసుకోవచ్చు. అందుకే ఎప్పుడూ గడువు లోపు రిటర్న్ దాఖలు చేయడమే మంచిది. ఎందుకంటే.. మనకు హోమ్ లోన్, ఎల్ఐసీ వంటివి లేకపోతే రిఫండ్ కాదు కాబట్టి.. షేర్లు, ముచ్యువల్ ఫండ్స్ వాటిలో నష్టాలను కూడా రిఫండ్ లో మెన్షన్ చేసి డబ్బులు పొందేందుకు పనికొస్తుంది.