Health Insurance on hospitalization: ఆసుపత్రిలో చేరకున్నా హెల్త్ ఇన్స్యూరెన్స్ పొందవచ్చా
Health Insurance on hospitalization: ఇటీవల కాలంలో అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. అనారోగ్య సమస్యలతో పాటు, చికిత్స విధానం భారీగా పెరగడంతో చాలా మంది ఇన్స్యూరెన్స్‌పై ఆధారపడుతున్నారు. ఆసుపత్రిలో జాయిన్ అయిన తరువాత చికిత్స చేయించుకొని ఇన్స్యూరెన్స్ క్లైయిమ్ చేసుకుంటున్నారు. అయితే, క్లెయిమ్ చేసుకునే విషయంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ ప్రకారం, చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాలి. అలా ఆసుపత్రిలో చేరి 24 గంటలపాటు చికిత్స తీసుకోవాలి. అలా చికిత్స తీసుకుంటేనే ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. లేదంటే ఇన్స్యూరెన్స్ అప్లికబుల్ కాదు. పెరుగుతున్న సాంకేతిక విధానం, చికిత్స అందించడంలో వేగం పెరగడంతో ఇన్ పేషెంట్‌గా చేరాల్సిన అవసరం లేకుండానే చికిత్స తీసుకొని డిశ్చార్జ్ అవుతున్నారు.
ఒకవేళ ఇన్‌పేషెంట్‌గా ఆసుపత్రిలో చేరినప్పటికీ, 24 గంటల కంటే ముందే డిశ్చార్జ్ అవుతున్నారు. వీటికి ఇన్స్యూరెన్స్ అప్లికబుల్ కాదని ఓ ఇన్స్యూరెన్స్ సంస్థ క్లెయిమ్‌ను తిరస్కరించడంతో వడోదరాకు చెందిన రమేష్ చంద్రజోషి అనే వ్యక్తి కన్జ్యూమర్ ఫోరంలో కేసు దాఖలు చేశారు. 2016 నవంబర్ 24వ తేదీ సాయంత్రం 5:38 గంటల నుండి మరుసటి రోజు సాయంత్రం 6:30 గంటలకు వరకు ఆసుపత్రిలోనే ఉన్నానని, 6:30 గంటలకు డిశ్చార్జ్ చేశారని పేర్కొన్నారు. దానికి సంబంధించిన ఆధారాలను కూడా కోర్టులో సబ్మిట్ చేశాడు. కాగా, దీనిపై కోర్టు వినియోగదారుడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకొని తక్కువ సమయంలోనే చికిత్స పూర్తవుతుందని, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకున్నా ఇన్స్యూరెన్స్ కంపెనీలు క్లెయిమ్‌ను తిరస్కరించలదేని, క్లెయిమ్‌ను వినియోగదారుడికి చెల్లించాలని తీర్పు ఇచ్చింది.