Richest Indian Woman : భారత్ లో అత్యంత సంపన్న మహిళ ఎవరో తెలుసా?
HCL Chairperson Roshni Nadar Malhotra become Richest Indian Woman : ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ కోటక్ మహీంద్రా హురున్ ఇండియా సంస్థలు తాజాగా భారత్ ఓ అత్యంత సంపన్నమైన వంద మంది మహిళల జాబితాలు సంయుక్తంగా విడుదల చేశాయి. ఈ జాబితాలో రోషిని నాడా, ఫల్గుణి నాయర్లు మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. భారత దేశంలోని అత్యంత సంపన్న మహిళల జాబితాలో హెచ్ ఎల్ టెక్నాలజీస్ చైర్ పర్సన్ రోషిని నాడార్ మొదటి స్థానంలో నిలిచారు. ఆమెకు నికర సంపద ఏకంగా 54 శాతం పెరిగి 84.330 కోట్లు అయినట్లు నివేదికలో వెల్లడించారు. ఇక తర్వాత నైకా పేరుతో కాస్మెటిక్స్ రాయడంలో రాణిస్తున్న ఫల్గుని నాయర్ రెండో స్థానంలో నిలిచారు. ఏడాదిలో ఆమె సంపద ఏకంగా 963 శాతం పెరిగినట్లు తాజాగా నివేదికలో వెళ్లడైంది. ఇక బయోకాన్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ సంపద 21 శాతం తగ్గడంతో ఆమె మూడో స్థానంలో నిలబడాల్సి వచ్చింది. కాగా హైదరాబాదులో 12 మంది అత్యంత సంపన్న మహిళలు ఉన్నారు. వారిలో దివి లేబరేటరీస్ డైరెక్టర్ నీలిమ మొదటి స్థానంలో నిలబడగా, బయోలాజికల్ ఈ లిమిటెడ్ ఎండి మహిమ రెండో స్థానంలో నిలిచారు. తర్వాత శోభన కామినేని మూడో స్థానంలో నిలిచారు.