Belgium lottery: 165 మందికి జాక్‌పాట్, 1200 కోట్ల రూపాయల బహుమతి
Group of 165 people from Belgian village wins $151.18 million in EuroMillions lottery
బెల్జియం దేశంలోని ఓ గ్రామం వార్తల్లో నిలిచింది. ఆ గ్రామంలో 165 మంది జాక్‌పాట్ కొట్టేశారు. ఒక్కక్కరి అకౌంట్‌లో ఏడున్నర కోట్ల రూపాయలు డిపాజిట్ అయ్యాయి. ఓల్మెన్ అనే ఈ గ్రామానికి చెందిన 165 మంది విజేతలుగా నిలిచారని యూరో న్యూస్ తెలిపింది.
మొత్తం `165 మంది 1200 కోట్ల విలువైన బహుమతి గెలుచు కున్నారు. వీరంతా ఎంతో ఆనందంగా ఉన్నారు. క్రిస్మస్ పండుగ ముందే వచ్చిందని సంబర పడుతున్నారు.
మొత్తం 9 దేశాలు యూరో మిలియన్స్ జాక్‌పాట్‌ను నిర్వహిస్తున్నాయి. ఫ్రాన్స్, స్విర్జర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రియా, పోర్చుగల్, బెల్జియం, ఐర్లాండ్, స్పెయిన్, లక్సెంబర్గ్ తదితర దేశాలు జాక్‌పాట్ నిర్వహిస్తున్నారు.