RBI Governor: శక్తికాంత్ దాస్ అరుదైన ఘనత, గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు సొంతం
Governor of the year award for RBI Governor
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ అరుదైన ఘనత సాధించారు. 2023 గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్నారు. కరోనా సమయంలో ఎన్నో ఒత్తిడులను ఎదుర్కొంటూ సమర్ధంగా విధులు నిర్వహించినందుకు, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా నెలకొన్నిద్రవ్యోల్భణం ఒత్తిళ్లు కూడా శక్తికాంత దాస్ సమర్ధంగా ఎదుర్కొన్నారని ఇంటర్నేషన్ రీసెర్చ్ జర్నల్ సెంట్రల్ బ్యాంకింగ్ కొనియాడింది.
2015లో అప్పటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్ అందుకున్నారు. ఆ తర్వాత ఈ అవార్డు శక్తికాంత్ దాస్ కు లభించింది. ఎన్నో రాజకీయ ఒత్తిళ్లను అధిగమించిన శక్తికాంత్ దాస్ రిజర్వ్ విధులు అత్యంత సమర్ధవంతంగా నిర్వహించినట్లు ఇంటర్నేషన్ రీసెర్చ్ జర్నల్ సెంట్రల్ బ్యాంకింగ్ ప్రశంసలు కురిపించింది.
రిజర్వ్ బ్యాంకులో అనేక సంస్కరణలు, వినూత్న రీతిలో పేమెంట్ విధానాలు అమలు చేయడం, ఆర్ధికాభివృద్ధి దిశగా చేపట్టిన అనేక చర్యలు కరోనా కాలంలో సత్ఫలితాలను ఇచ్చిందని ఇంటర్నేషన్ ఎకనమిక్ రీసెర్చ్ జర్నల్ ప్రస్తావించింది.