మగువలు ఎక్కువగా ఇష్టపడేదాంట్లో బంగారం(Gold) ఒకటి. ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే మందుగా బంగారం కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతారు. కాగా, నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్న దిగొచ్చిన గోల్డ్ రేట్స్ (Gold Price) నేడు అమాతం పెరిగాయి.
Gold: మగువలు ఎక్కువగా ఇష్టపడేదాంట్లో బంగారం(Gold) ఒకటి. ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే మందుగా బంగారం కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతారు. కాగా, నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్న దిగొచ్చిన గోల్డ్ రేట్స్ (Gold Price) నేడు అమాతం పెరిగాయి. హైదరాబాద్ (Hyderabad) మార్కెట్లో బంగారం ధర10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్న 55,200 ఉండగా, నేడు 400 పెరగడంతో గోల్డ్ రేట్స్ రూ.55,600గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న60,220 ఉండగా, నేడు 460 పెరగడంతో గోల్డ్ రేట్ రూ. 60,680గా ఉంది. విజయవాడలో (Vijayawada) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,600 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,650గా కొనసాగుతోంది. విశాఖపట్నంలో (Vizag) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,650 లుగా పలుకుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.400 పెరిగి ప్రస్తుతం రూ.55 వేల 750 పలుకుతోంది. ఇక 24 క్యారెట్ల్ మేలిమి గోల్డ్ రేటు ఢిల్లీలో రూ.460 పెరిగి రూ.60 వేల 830 వద్దకు చేరుకుంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,650గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 56,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 61,100 వద్ద కొనసాగుతోంది.
వెండి విషయానికి వస్తే ఇవాళ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. కిలో వెండి రేటు ఒక్కరోజులో రూ.2000 పెరిగింది. మన హైదరాబాద్లో కిలో వెండి (Silver) రేటు నేడు రూ.2000 పెరిగి ప్రస్తుతం రూ.79 వేల 700 పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో వెండి రేటు కిలోపై రూ.1100 పెరిగి ప్రస్తుతం రూ.74 వేల 500 వద్ద ధర కొనసాగుతుంది.