Gautam Adani: దేశం రుణం తీర్చుకోనున్న అదానీ. సేవా కార్యక్రమాలకి 60 వేల కోట్లు
Adani Family commit Rs.60,000 cr in charity: మన దేశంలోని అగ్ర శ్రేణి పారిశ్రామికవేత్త, ప్రపంచంలోని టాప్ టెన్ కుబేరుల్లో ఒకరైన గౌతమ్ అదానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సేవా కార్యక్రమాల కోసం ఏకంగా 60 వేల కోట్ల రూపాయలను వెచ్చించనున్నట్లు ప్రకటించారు. ఈ నిధులను మన దేశంలోని ఆరోగ్యం, విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో ఖర్చుచేయనున్నట్లు తెలిపారు. ‘భారతదేశాన్ని భవిష్యత్ సవాళ్లకు సంసిద్ధంగా, సమానత్వంగా నిర్మించేందుకు ఇది తన వంతు సాయం’ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.
తన తండ్రి వందో జయంతి, తన 60వ పుట్టిన రోజు సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యాపార రంగంలో గౌతమ్ అదానీ గత ఐదారేళ్లలో శరవేగంగా దూసుకొచ్చారు. బొగ్గు గనులు, విద్యుత్ ప్రాజెక్టులు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, మీడియా తదితర అన్ని రంగాల్లోకి ప్రవేశించారు. అనూహ్య రీతిలో భారీ లాభాలు ఆర్జించారు. ఇక సమాజానికి చేయూతనిచ్చేందుకు కదిలారు. తనను ఇంతవాణ్ని చేసిన ఈ దేశ రుణం తీర్చుకోనున్నారు. దాతృత్వంలో అజీమ్ ప్రేమ్ జీ, రతన్ టాటాల సరసన చేరనున్నారు.