Ford Motors Key decision on Employees: ఫోర్డ్ మోటార్స్ నుండి 3 వేల మంది ఉద్యోగుల తొలగింపు
Ford Motors Key decision on Employees: అమెరికాకు చెందిన ఫోర్డ్ మోటార్స్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకున్నది. తమ కంపెనీలో పనిచేస్తున్న 3200 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. అమెరికాకు చెందిన ఈ కంపెనీకి వివిధ దేశాల్లో శాఖలు ఉన్నాయి. జర్మనీ కేంద్రంగా సాగుతున్న ఫోర్డ్ కంపెనీలోని ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించినట్లు అధికారులు పేర్కొన్నారు. గత ఏడాది ఈ కంపెనీ నుండి సుమారు 3 వేల మంది ఉద్యోగులను తొలగించారు. కాగా, ఇప్పుడు మరో 3200 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపనున్నారు.
ఆర్థిక మాంద్యంతో పాటు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా జర్మనీకి సరఫరా కావలసిన చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో అక్కడి కంపెనీలు అష్టకష్టాలు పడుతున్నాయి. గ్యాస్ లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిశ్రమలకు గ్యాస్ సరఫరా లేకపోవడంతో ఉత్పత్తి రంగాలు కుదేలవుతున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో పరిశ్రమలు నడవడంలేదు. యుద్ధం ముగిసి తిరిగి చమురు, గ్యాస్ సరఫరా జరిగే వరకు కూడా ఇలాంటి ఇబ్బందులు తప్పవని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. జర్మనీలో ద్రవ్యోల్భణం ఆకాశాన్ని తాకుతున్నది. ద్రవ్యోల్భణం పెరిగిపోవడంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.