ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో 12 మంది తెలుగువారు
ఫోర్ట్స్ ప్రతీ ఏటా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కుబేరుల లిస్టు ను తన పత్రిక ద్వారా వెల్లడిస్తుంది. అలా ఈ సారి కూడా ఫోర్బ్స్ ప్రకటించిన జాబితాలో 12మంది తెలుగువారికి చోటు దక్కింది. ఈసారి ఫోర్బ్స్ ఇండియా జాబితాలో మరోసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. రూ.6.80 లక్షల కోట్ల వ్యక్తిగత సంపదతో మొదటి స్థానంలో నిలిచారు. ఆ తరువాత అదానీ రూ.6.75 కోట్లతో రెండవ స్థానంలో ఉన్నారు.ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కుబేరుల లిస్టు లో ప్రధమ స్థానం ఎలన్ మస్క్ కు దక్కింది. రూ.16.43 లక్షల కోట్ల సంపదతో ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఉన్నారు మస్క్.