Twitter Layoffs: ఆ టీమ్‌పైనే ఎలాన్ మస్క్ దృష్టి… డజనుకుపైగా ఉద్యోగులు తొలగింపు
Twitter Layoffs: ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తరువాత ఎలాన్ మస్క్ అనేక మార్పులు తీసుకొచ్చారు. టిక్ మార్క్ నుండి భారం తగ్గించుకునే వరకు మస్క్ నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాల కారణంగా అనేకమంది ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నవంబర్ నెలలో కొంతమంది ఉద్యోగులను తొలగించగా, మస్క్ తీసుకున్న నిర్ణయాలతో కుదురుకోలేక అనేకమంది తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేసి పక్కకు తప్పుకున్నారు. 3700 మంది ఉద్యోగులను మస్క్ ఫైర్ చేయగా, వేలాది మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా రాజీనామాలు చేసి వెళ్లిపోయారు.
కాగా, మస్క్ తాజాగా గ్లోబల్ కంటెంట్ మోడరేషన్‌ను హ్యాండిల్ చేస్తున్న ట్రస్ట్ అండ్ సేఫ్టీ విభాగానికి చెందిన పలువురు ఉద్యోగులపై మస్క్ వేటు వేశారు. ఏసియా ఫసిఫిక్ రిజీయన్ హెడ్ నూర్ అజార్, ట్విట్టర్ రెవెన్యూ పాలసీ సీనియర్ డైరెక్టర్ డొమింగ్యూజ్ లను తొలగించారు. వీరితో పాటు డజనుకు పైగా ఉద్యోగులకు మస్క్ పింక్ స్లిప్ జారీ చేశారు. ఇందులో కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు కూడా ఉన్నట్లు రాయటర్స్ సంస్థ తెలియజేసింది. ఈ తొలగింపులపై ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మస్క్ మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.