హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాములు ఎంతంటే...
GOLD PRICE : ఇవాళ కూడా మార్కెట్లో బంగారం (Gold) ధరలు (Price) దిగొచ్చాయి. ఈ మధ్య భారీగా పెరుగుతున్న బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నట్టు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ (Hyderbad) మార్కెట్లో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర ఒక్కరోజే రూ. 450 పతనమైంది. దీంతో ఇప్పుడు 10 గ్రాముల బంగారం రేటు నగరంలో రూ.56,300కు చేరింది. ఇదే సమయంలో 10 గ్రాముల గోల్డ్ రేటు 24 క్యారెట్స్కు హైదరాబాద్లో రూ.490 పడిపోయి ఇప్పుడు రూ.61,420 మార్కుకు చేరింది. దిల్లీ (delhi) మార్కెట్లో కూడా గోల్డ్ రేట్లు ఇదే రీతిలో పడిపోయాయి. అక్కడ 22 క్యారెట్స్ గోల్డ్ రేటు 10 గ్రాములకు తాజాగా రూ.450 పడిపోగా.. రూ.56,450కి తగ్గింది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ. 490 పడిపోయి.. రూ.61,570 వద్దకు చేరింది.
చాలా రోజుల తర్వాత
చాలా రోజుల తర్వాత బంగారం, వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. దీంతో గోల్డ్ కొనాలనుకునేవారికి ఎట్టకేలకు కొంతలో కొంత ఊరట దక్కిందని చెప్పొచ్చు. ఇప్పటికి కూడా బంగారం రేట్లు గరిష్టాల వద్దే ఉన్నాయన్న విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న నేపథ్యంలో బంగారం, వెండి రేట్లు ఇంతలా పడిపోవడం సానుకూలాంశం. హైదరాబాద్లో కూడా చాలా రోజులకు సిల్వర్ రేటు భారీగానే తగ్గింది. ఒక్కరోజులో రూ.600 పడిపోయి ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.78,200కు చేరింది. యూఎస్ ఫెడ్ రేట్లకు అనుగుణంగా ఎక్కువగా బంగారం, వెండి రేట్లు కదలాడుతుంటాయి. ఫెడ్ వడ్డీ రేట్లు పెంచితే బంగారం ధర మరింత పడిపోయే అవకాశాలు ఉంటాయి.