బంగారం ధర ఎంత తగ్గింది ?
Gold Price : వేసవి వేడి కంటే బంగారం రేట్ల హీటే భారతీయులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. రోజురోజుకు ఎవరూ ఊహించని విధంగా పుత్తడి ధరలు పరుగులు తీస్తున్నాయి. వంద రూపాయలు తగ్గిందని సంతోషించేలోగా.. రూ. 5 వందలు పెరిగి షాక్ ఇస్తున్నాయి. ఈ రోజు బంగారం ధర 10 రూపాయలు మాత్రమే తగ్గిందని బాధ పడాలో లేక మరోసారి పెరగకుండా.. అవే ధరతో స్థిరంగా ఉందని సంతోషించాలో తెలియని విధంగా పుత్తడి ధర తగ్గింది.
సాధారణంగానే భారతీయ మహిళలకు బంగారం అంటే మక్కువ ఎక్కువ. ఇక పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలలో అయితే బంగారాన్ని కానుకగా ఇచ్చే సాంప్రదాయం భారతీయుల్లో బాగా ఎక్కువ. అందుకే ఎంత ధర పెరిగినా కొనేవాళ్లు తగ్గడం లేదు కాకపోతే తులం, రెండు తులాలు కొని బహుమానంగా ఇచ్చేవాళ్లు ఇప్పుడు సగానికి సగం తగ్గించి కొంటున్నారు. దానికి తోడు అవసరానికి ఉపయోగపడే ఒక పెట్టుబడిగా బంగారాన్ని కొంటూ ఉండేవాళ్లు కూడా ఉన్నారు. అందుకే ఇండియాలో బంగారానికి ఎప్పుడూ ఫుల్ డిమాండ్ ఉంటుంది.
హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లకు ఈ రోజు రూ.10 తగ్గి రూ.56వేల 640గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.10 తగ్గడంతో.. రూ.61వేల 790 గా సాగుతుంది. అటు ఢిల్లీ మర్కెట్లోనూ బంగారం ధర కేవలం పది రూపాయలు మాత్రమే తగ్గింది. 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ.10 తగ్గి రూ.56వేల790 వద్ద కొనసాగుతోంది. మరోవైపు 24 క్యారెట్స్ గోల్డ్ రేటు కూడా రూ.10 తగ్గి 10 గ్రాములకు రూ.61వేల 940 గా ఉంది.
మరో వైపు బంగారం ధర తగ్గీ తగ్గనట్లు తగ్గితే.. వెండి రేటు మాత్రం అలాగే కొనసాగుతోంది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ.78వేల 500 వద్ద ఉండగా.. ఢిల్లీలో కేజీ సిల్వర్ రేటు రూ.74 వేల 800 గా ఉంది.