Disney: 4 వేల మందికి ఉధ్వాసన పలకునున్న డిస్నీ, ఎందుకో తెలుసా?
Disney company to lay off 4000 employees in the month of April
ప్రపంచ ప్రఖ్యాత డిస్నీ సంస్థ 4 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయించింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఉద్యోగులకు ఉధ్వాసన పలకనుంది. బడ్జెట్ నియంత్రణలో భాగంగా ఉద్యోగాల్లో కోత విధించనుంది. సంస్థ నుంచి ఎవరెవరిని బయటకు పంపాలనే విషయంలో ఓ క్లారిటీతో ఉంది. సంస్థకు భారంగా మారుతున్న ఉద్యోగుల జాబితాను తయారు చేయాలని సంస్థలోని మేనేజర్లను యాజమాన్యం కోరింది.
డిస్నీ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం హులులో కూడా కోతలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో సంథ సీఈఓ బాబ్ ఇగర్ 7 వేల మంది ఉద్యోగులను తొలగిస్తామని వెల్లడించారు. కంపెనీలో మార్పులు చేర్పులు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఆర్ధిక అస్థిరత ఏర్పడిన కారణంగా వందలాది దిగ్గజ కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నారు. ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్ కంపెనీలతో పాటు అనేక ప్రముఖ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి.
Disney planning to lay off 4000+ employees in upcoming month – Report says
— Niranjan 💫 (@A_Thalapathyan) March 19, 2023