DGCA: విమాన యాన సంస్థలకు డీజీసీఏ కీలక సూచనలు
DGCA Crucial Orders to Airlines: విమాన ప్రయాణాల్లో అవాంచనీయ సంఘటనల నియంత్రణ కోసం డీజీసీఏ సూచనలు జారీ చేసింది. విమానాల్లో జరుగుతున్న అవాంఛ సంఘటనలపై ఎయిర్ లైన్స్ చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నాయని, ఈ చర్యల వల్ల ఎయిర్ వేస్ ప్రతిష్ట మసకబారుతోందని డీజీసీఏ పేర్కొంది. ఇక ఈ క్రమంలో పైలట్‌ల బాధ్యతలుగా చెబుతూ ప్రయాణంలో పైలట్ ఇన్ కమాండర్ అని ప్రయాణ సమయంలో విమానం ఆపరేషన్, భద్రతకు బాధ్యత పైలట్ దేనాని పేర్కొన్నారు. అంతేకాక క్యాబిన్ సిబ్బంది పరిస్థితిని నియంత్రించ లేక పోతే, తదుపరి చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. విమానం ల్యాండింగ్ అయిన తర్వాత, ఏరోడ్రోమ్‌లోని భద్రతా ఏజెన్సీ వద్ద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, వికృతంగా వ్యవహరించిన ప్రయాణీకులను భద్రతా సిబ్బందికి అప్పగించాలని పేర్కొన్నారు. క్యాబిన్ సిబ్బంది బాధ్యతలు అని చెబుతూ వికృతంగా వ్యవహరించే ప్రయాణీకులను నియంత్రించేందుకు ప్రయత్నించాలని పేర్కొంది. ఎంత వారించినా , ప్రయాణికులు తమ తీరు మార్చుకోకపోతే, చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటే ఎటువంటి పరిణామాలు జరుగుతాయో వివరించాలని పేర్కొన్నారు. అదే విధంగా డీజీసీఏకి సమాచారం అందించాలని కూడా డీజీసీఏ పేర్కొంది.