Rana Daggubati: కన్‌ఫర్మ్ టికెట్ ప్రచారకర్తగా రానా…
Rana Daggubati: సినీహీరో దగ్గుబాటి రానాను రైల్ టికెట్ బుకింగ్ యాప్ కన్‌ఫర్మ్ టికెట్ ప్రచారకర్తగా నియమించింది. ఈ కన్‌ఫర్మ్ టికెట్ యాప్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చని నిర్వహకులు పేర్కొన్నారు. అంతేకాకుండా, రైలు ప్రయాణంలో అందించే సౌకర్యాలకు సంబంధించిన ఫీచర్లకోసం ప్రత్యేకంగా ట్రైన్ టికెట్ టైగర్ అనే సరికొత్త కార్యక్రమాన్ని కూడా ఈ యాప్ లో రూపొందించారు. ఈ యాప్ ద్వారా రైలు ప్రయాణంలో అందిస్తున్న సౌకర్యాలు, ఇతర సదుపాయాలు వంటి వాటి గురించి తెలుసుకునేందుకు వీలు కలుగుతుంది. ఈ యాప్ కోసం దగ్గుబాటి రానాను ప్రచార కర్తగా నియమించుకున్నట్లు యాప్ యాజమాన్యం తెలియజేసింది.
యాప్ కోసం ప్రచారంలో రానా సరికొత్తగా కనిపించబోతున్నారు. ఇక ఈ ట్రైన్ కన్‌ఫర్మ్ టికెట్ యాప్ ప్రచారంలో భాగం కావడంత సంతోషంగా ఉందని, భాగస్వామ్యం పట్ల ఉత్సాహం చూపుతున్నట్లు రానా తెలియజేశారు. ఈ యాప్ ద్వారా బోర్డింగ్ తో పాటు డ్రాపింగ్ పాయింట్లను కూడా మార్చుకునే సౌకర్యం అందుబాటులో ఉంటుందని యాప్ యాజమాన్యం తెలియజేసింది. రైల్ టికెట్ బుకింగ్ కోసం వివిధ ప్లాట్ ఫామ్ లు అందుబాటులో ఉన్నప్పటికీ, సరికొత్త ఫీచర్లతో, సరికొత్త సదుపాయాలు కల్పిస్తున్న కన్‌ఫర్మ్ టికెట్ యాప్ ఇప్పటికే లక్షలాది మందికి చేరువైందని రానా ప్రచార కర్తగా నియమించుకున్నాక మరింత మందికి చేరువౌతుందని యాప్ యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసింది.