Credit Card Outstanding: గరిష్ట స్థాయికి చేరుకున్న క్రెడిట్ కార్డుల వినియోగం, కారణాలు ఇవే
Credit Card Outstanding Rises to Record High In January 2023
ఏడాది జనవరి చివరి నాటికి క్రెడిట్ కార్డుల అవుట్‌స్టాండింగ్ 29.6 శాతం పెరిగి రూ. 1.87 లక్షల కోట్ల ఆల్‌టైమ్ హై మార్కును అందుకుంది. రిజర్వ్ బ్యాంకు డేటా ప్రకారం ఈ ఆర్ధిక సంవత్సరంలో 10 నెలల్లో క్రెడిట్ కార్డుల ఔట్ స్టాండింగ్ 20 శాతంపైనే పెరిగింది. జూన్ 2022లో అత్యధికంగా 30.7 శాతం ఔట్ స్టాండింగ్ నమోదయింది. జనవరి నెలలో క్రెడిట్ కార్డుల ద్వారా చేసిన ఖర్చు రూ. 1.28 లక్షల కోట్లుకు చేరుకుంది. గత ఏడాది చివరి నెలలో ఈ విలువ రూ. 1.26 లక్షల కోట్లు ఉంది.
దేశంలో ప్రస్తుతం అనేక సేవలు డిజిటైజ్ చేయడం కారణంగా క్రెడిట్ కార్డుల వినియోగం విపరీతంగా పెరిగింది. కరోనా తగ్గు ముఖం పట్టడంతో ఆర్ధిక వ్యవస్థ గాడిన పడింది. ఖర్చులు చేసేందుకు ప్రజలు ఇబ్బంది పడడం లేదు. ఆరోగ్యానికి, ఫిట్ నెస్, ఎడ్యుకేషన్ రంగాలలో ఖర్చులకు వెనకాడ కుండా ప్రజలు ఖర్చు చేస్తున్నారు. ఈ కారణంగా గత కొన్ని నెలలుగా క్రెడిట్ కార్డుల వినియోగం క్రమ క్రమంగా పెరుగుతూ వస్తోంది.
జనవరి చివరి నాటికి దేశ వ్యాప్తంగా ఉన్న క్రెడిట్ కార్డుల సంఖ్య 8.25 కోట్లకు చేరుకున్నట్లు బ్యాంకింగ్ నిపుణులు తెలిపారు. హెచ్.డీ.ఎఫ్.సీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, కొటాక్ బ్యాంక్ లు దేశంలో ఎక్కువ క్రెడిట్ కార్డులు జారీ చేసిన బ్యాంకుల జాబితాలో టాప్ 5 స్థానాల్లో ఉన్నాయి.