Cisco: నెట్‌వర్కింగ్ దిగ్గజం సిస్కోలో కొలువుల కోత, 700 మందికి ఉధ్వాసన
Cisco announces lays offs of nearly 700 employees
ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ కంపెనీలన్నీ ఉద్యోగాలలో కోతను విధిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన ఆర్ధిక అస్థిరత కారణంగా ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా తగ్గించుకుంటున్నాయి. తాజాగా నెట్‌వర్కింగ్ దిగ్గజ కంపెనీ సిస్కో 700 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. శాన్ ఫ్రాన్సిస్కో కార్యాలయంలో 80 మందితో సహా మొత్తం 800 మంది ఉద్యోగులను తొలగించింది.
గత ఏడాది నవంబర్ నెలలో సిస్కో సంస్థ 673 మందిని తొలగించింది. సిస్కో సంస్థ ప్రధాన కార్యాలయంలో మొత్తం 371 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. అందులో ఇద్దరు వైస్ ప్రెసిడెంట్లు కూడా ఉన్నారు.
మొత్తంగా సంస్థలోని 5 శాతం మందిని తొలగించేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అంటే మొత్తం 4000 మందికి ఉధ్వాసన తప్పనున్నట్లు తెలుస్తోంది. సంస్థలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో 52 శాతం మంది అమెరికా ఏతర దేశాల్లో పని చేస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా అనేక సంస్థలు నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఉద్యోగుల జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితికి వచ్చాయి. దీంతో అనేక కంపెనీలు ఉద్యోగులకు ఉధ్వాసన పలుకుతున్నాయి.