Are Anand Mahindra and Bill Gates are Friends: సోషల్ మీడియాలో వైరల్ ప్రశ్న… ఆ దిగ్గజాలిద్దరూ స్నేహితులా?
Are Anand Mahindra and Bill Gates are Friends: దేశీయ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా నిత్యం వార్తల్లో ఉంటూనే ఉంటారు. ప్రపంచానికి నచ్చిన విషయాలను, దేశంలో జరుగుతున్న విషయాలను ఆయన నిత్యం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నెటిజన్లకు అందుబాటులో ఉంటాడు. ఇక, ప్రపంచంలో టెక్నాలజీ రంగాన్ని మార్చేసిన, శాశించిన సంస్థ మైక్రోసాఫ్ట్. ఈ సంస్థ అధ్యక్షుడు బిల్ గేట్స్ మిలిందా గేట్స్ పేరుతో ఫౌండేషన్‌ను నిర్వహిస్తూ వేల కోట్ల రూపాయలను వివిధ సంస్థల కోసం ఖర్చు చేస్తున్నారు. ఈ ఇద్దరూ దిగ్గజాలు కలిసి దిగిన ఫొటోతో పాటు బిల్‌గేట్స్ సైన్ చేసిన చిన్న గేట్స్ స్క్రిప్ట్ బౌండ్ వసోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ స్క్రిప్ట్ బౌండ్ పుస్తకాన్ని ఆనంద్ మహీంద్రాకు బిల్ గేట్స్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇందులో గేట్స్ నా క్లాస్ మేట్ ఆనంద్ అని రాశారు. ఈ చిన్న మాట, ఆ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ అయిన వెంటనే వైరల్ అయింది. ఆ ఇద్దరూ క్లాస్‌మేట్సా… ఎలా అని నెటిజన్లు ప్రశ్నించడం మొదలు పెట్టారు.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 1973లో బిల్‌గేట్స్ హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకునేందుకు అడ్మీషన్ పొందారు. రెండేళ్ల తరువాత అంటే, 1975లో చదువును ఆపేశాడు. అయితే, ఆనంద్ మహీంద్రా అదే యూనివర్శిటీ నుండి 1977లో పట్టభద్రుడు అయ్యాడు. వీరిద్దరూ 1973,1974లో ఒకే కాలేజీ, క్యాంపస్‌లో ఉన్నట్లుగా రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అప్పటి నుండి వీరిద్దరూ మంచి స్నేహితులని అర్థం అవుతున్నది. ఇరువురూ తరచుగా కలుసుకుంటూనే ఉంటారు. బిల్‌గేట్స్ టెక్నాలజీ పరంగా ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తే, ఆనంద్ మహీంద్రా కార్ల వ్యాపార రంగంలో తిరుగులేని వ్యపారవేత్తగా సంచలనాలు సృష్టిస్తున్నారు. తెలిపారు.