మధ్యతరగతి వారి గురించి ఆలోచించే కంపెనీ ఏదంటే టక్కున చెప్పేపేరు టాటా కంపెనీ..సామాన్యుడికి అందుబాటులోఉండేలా ఉత్పత్తులని తయారుచేస్తూ.. టాటా ప్రోడక్ట్ ను అతిసామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేలా ధరలను నిర్ణయించి వారికీ చెరువవుతుంది.
Tata Group: మధ్యతరగతి వారి గురించి ఆలోచించే కంపెనీ ఏదంటే టక్కున చెప్పేపేరు టాటా కంపెనీ..సామాన్యుడికి అందుబాటులోఉండేలా ఉత్పత్తులని తయారుచేస్తూ.. టాటా ప్రోడక్ట్ ను అతిసామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేలా ధరలను నిర్ణయించి వారికీ చెరువవుతుంది. ఆ మధ్య మధ్యతరగతి వారి కోసం టాటా నానో కారు వచ్చింది. మిడిల్ క్లాస్ వారు కారు ఎక్కాలన్న ఉద్దేశంతో లక్ష రూపాయల బడ్జెట్ లో కారు తయారు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. అంతకుముందు లక్ష రూపాయల్లో కారా..? ఇంపాజిబుల్ అన్నవారే ఇట్స్ పాజిబుల్ అని అన్నారు. టాటా ఏ ప్రాజెక్ట్ చేపట్టిన అది ముందుగా సామాన్య మానవుడిని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్ట్స్ చేపడుతుంది. విలువలతో కూడిన వ్యాపారం, విశ్వసనీయత కలిగిన సంస్థ టాటా గ్రూప్. వ్యాపారవేత్తగా కాకుండా నికార్సైన పారిశ్రామికవేత్తగా రతన్ టాటా జీవిస్తారు. వ్యాపారవేత్త లాభాలు తీసుకుంటాడు, పారిశ్రామికవేత్త పరిశ్రమలను పెంచుకుంటూ.. పది మందికి ఉపాధి పెంచుకుంటూ వెళ్ళిపోతాడు. రతన్ టాటా కూడా పారిశ్రామికవేత్తనే. సంస్థ లాభాల్లో సగానికి పైగా వాటాను సమాజం కోసం వెచ్చిస్తారు తాజాగా టాటా గ్రూప్ ఐ-ఫోన్లను తయారుచేయనుంది.
ఆపిల్ ఐఫోన్ల తయారీ ప్రక్రియలో భారత్‌లో ప్రారంభం కాబోతున్నది. ఫాక్స్‌కాన్, లగ్జేర్తోపాటు టాటా గ్రూప్ కూడా దేశీయంగా ఐఫోన్ల తయారీలో భాగస్వామి కాబోతున్నది.ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో మార్కెట్లోకి వెలుగు చూడనున్న ఐఫోన్15, ఐఫోన్15 ప్లస్ మోడల్స్‌ను టాటాగ్రూప్ రూపొందించనుంది. భారత్‌లో ఐఫోన్ తయారీని చేపట్టిన మొదటి స్వదేశీ సంస్థగా టాటా నిలిచింది. ప్రస్తుతం ఐఫోన్లను భారత్, చైనాలలో తైవాన్‌కు చెందిన విస్ట్రన్, ఫాక్స్‌కాన్ టెక్నాలజీ కంపెనీలు అసెంబ్లింగ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ ప్రక్రియ ఇండియాలో మొదలు కానుంది. టాటా సంస్థ ఐఫోన్ల తయారీని చేపట్టడం వల్ల దేశీయ తయారీ రంగానికి మరింత ఊతం లభిస్తుందనే చెప్పాలి. ఇతర గ్లోబల్ సంస్థలకు కూడా దేశంలో ప్లాంట్ల ఏర్పాటుకు వీలవుతుంది.
ఆపిల్ ఫోను తయారీ స్థావరాన్ని భారతదేశంలో విస్తరించాలని చూస్తున్నందున, 2023 ఐఫోన్ సిరీస్ ఫోన్లలో రెండు భారతదేశంలో తయారు చేయబడతాయని ఒక నివేదిక సూచిస్తుంది. ట్రెండ్‌ఫోర్స్ ప్రకారం, ఐఫోన్ 15 మరియు ఐఫోన్ 15 ప్లస్ మోడల్లను భారతదేశంలో తయారు చేయవచ్చు. హ్యాండ్సెట్లను టాటా గ్రూప్ అసెంబ్లింగ్ చేస్తుందని నివేదిక పేర్కొంది. చైనా నుంచి ఐ-ఫోన్ల తయారీ ఇతర దేశాలకు తరలించాలని ఆపిల్ భావిస్తున్నది. కార్మికుల నిరసనలు, అసెంబ్లింగ్‌లో సవాళ్లు, ఆలస్యం పెరిగిపోతున్న నేపథ్యంలో ఆపిల్ ఈ నిర్ణయం తీసుకున్నది. కరోనా మహమ్మారి వేళ చైనాలో ఫాక్స్‌కాన్ అత్యధికంగా ఐ-ఫోన్లు తయారు చేసింది. కానీ, కరోనా తర్వాత చైనా ఆవల.. భారత్, వియత్నాం వంటి దేశాల్లో ఆపిల్ ఐ-ఫోన్ల ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నది. వచ్చే నాలుగైదు ఏండ్లలో ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే తమ ఉత్పత్తుల్లో భారత్ నుంచే 25 శాతం చేయాలని ఆపిల్ ప్రణాళికలు రూపొందిస్తున్నది
ఇప్పటికే భారత్ లో టాటా మొదలుపెట్టిన.. టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కెమికల్స్, టాటా పవర్, టాటా కన్సల్టెన్ సీ సర్వీసెస్, టాటా ఎయిర్ లైన్స్ ఇలా ఒకటా, రెండా ఎన్నో వ్యాపారాల్లో అడుగుపెట్టి సక్సస్ ఫుల్ బిజినెస్ మాన్ గా రాణించారు. అగ్ర అగ్ర స్థానాన టాటా గ్రూప్ ని నిలబెట్టారు. నష్టాల్లో ఉన్న కంపెనీలను కొని లాభాలో బాటలో పరుగులు పెట్టించడం రతన్ టాటాకు వెన్నతో పెట్టిన విద్య. బెంగళూరులోని తైవాన్ కు చెందిన విస్ట్రాన్ కంపెనీ.. ఐఫోన్ ప్లాంట్ ను నిర్వహిస్తోంది. ఈ ప్లాంట్ ను కొనుగోలు చేసేందుకు టాటా గ్రూప్ కంపెనీ ప్రయత్నాలు చేస్తుందని.. ఈ నెలలోనే కొనుగోలు ప్రక్రియ ఉంటుందని అంతర్జాతీయ వెబ్ సైట్ వెల్లడించింది. అయితే ఈ ప్లాంట్ కొనుగోలు ప్రక్రియ పూర్తయితే గనుక యాపిల్ ఫోన్ల తయారీకి సంబంధించి భారత్ లో బెంగుళూరు తొలి ఐ ఫోన్ ప్లాంట్ కి కేంద్రబిందువవనుంది. తాజాగా టాటా సంస్థ జాయింట్ వెంచర్లో ఎక్కువ భాగం వాటాను తీసుకోవడంపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో టాటా గ్రూప్ బోర్డు మెంబర్ ఒకరు ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ, దక్షిణాదిలో ఐఫోన్ అసెంబ్లింగ్ ప్లాంట్‌ను టేకోవర్ చేయడం ద్వారా భారత్‌ను ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్‌గా మార్చాలనే లక్ష్యం నెరవేరుతుందన్నారు. ఈ ప్రక్రియ విజయవంతమైతే దేశీయ ఎలక్ట్రానిక్స్‌తో పాటు మైక్రో ఎలక్ట్రానిక్స్ తయారీలో అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.